Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బడ్జెట్ 2016-17‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం.. తెల్లని దుస్తుల్లో ప్రధాని మోడీ

Advertiesment
Cabinet approves
, సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (10:46 IST)
కేంద్ర వార్షిక బడ్జెట్ 2016-17కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రిమండలి సోమవారం ఉదయం ఆమోదముద్ర వేసింది. నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో బడ్జెట్‌ ఆమోదించారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
 
అంతకుముందు.. ఆయన రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడ నుంచి ఆయన పార్లమెంటుకు చేరుకున్నారు. అలాగే, అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టనున్న ఆర్థిక బడ్జెట్‌ ప్రతులను అధికారులు పార్లమెంటుకు చేర్చారు. వీటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోక్‌సభ సభ్యులకు అందజేస్తారు. 
 
మరోవైపు ఈరోజు నాకూ పరీక్షే అని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తెల్లని దుస్తులు ధరించి పార్లమెంటుకు చేరుకున్నారు. 125 కోట్ల మంది ప్రజలు పెట్టే పరీక్షలో విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నానని చెప్పిన ప్రధాని అదే ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలింపజేస్తూ ప్రశాంత వదనంతో పార్లమెంట్‌ భవన్‌కు చేరుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu