Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సహించేలా బడ్జెట్ ఉండాలి : దినేష్ అగర్వాల్

Advertiesment
Budget recommendation quote
, సోమవారం, 22 ఫిబ్రవరి 2016 (13:03 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌లో చిన్నమధ్యతరహా పరిశ్రమలకు ఊపిరిపోసేలా ప్రోత్సాహకాలు ప్రకటించాలని యాంకర్ ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ ఎంపీ దినేష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ ఉత్పత్తి రంగానికి మరింతగా ఊతమిచ్చేలా రాయితీలు ఉంటాయని తాము భావిస్తున్నట్టు చెప్పారు. 
 
నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భవన నిర్మాణరంగం చాలా మేరకు కుదేలైంది. కానీ ఇటీవల చేపట్టిన కొన్ని రకాల చర్యల వల్ల మెట్రో నగరాలతో పాటు.. సబర్బన్, సెమీ మెట్రో నగరాల్లో కమర్షియల్ (ఆఫీస్) స్పేస్‌లో పురోభివృద్ధి కనిపించింది. అంతేకాకుండా, పారిశ్రామిక యూనిట్ల నిర్మాణం ఊపదుకుంది. ఇలాంటి వాటిల్లో కొన్ని ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టుల వల్ల దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చినట్టేనని తెలిపారు. 
 
ప్రధానంమత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన 'మేక్ ఇండియా' ప్రాజెక్టులో భాగంగా అనేక రాష్ట్రాలు తీసుకున్న చర్యల వల్ల ఈ రంగం ఓ రూపును సంతరించుకుంది. ముఖ్యంగా ఉత్పత్తి రంగంలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు ఎంతగానో దోహదపడేలా విశ్వాసం కుదిరిందన్నారు. ఇది మున్ముందు కూడా ఇలానే కొనసాగేందుకు వీలుగా వచ్చే బడ్జెట్‌లోనూ మరిన్ని రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరారు. అయితే, ఈ రాయితీలు కేవలం ఉత్పత్తి రంగానికే పరిమితం చేయకుండా, చిన్న, మధ్యతరహా పరిశ్రలను కూడా ప్రోత్సహించేలా ఉండాలన్నదే తన అభిప్రాయంగా ఉందని దినేష్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu