ఆహార పదార్థాల్లో వందశాతం ఎఫ్‌డీఐ.. ఎక్సైజ్ పన్ను నుంచి బీడీలకు మినహాయింపు!

మార్చి 7 వరకు రేషన్ కార్డుల ఆధునీకరణ: అరుణ్ జైట్లీ

సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (12:46 IST)
బీమా, పెన్షన్ రంగాల్లో ఎఫ్‌డీఐ విధానంలో మార్పులు చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. చిన్న మోతాదులో పన్ను కట్టేవాళ్లకు మరింత రిలీఫ్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. కిరాయి ఇండ్లల్లో ఉన్నవారికి పన్ను పోటు నుంచి మరింత వెసలుబాటు కల్పించనున్నారు. మార్చి 7 వరకు సుమారూ మూడు లక్షల రేషన్ షాపులను ఆధునీకరించనున్నారు. 
 
ఆర్థిక డేటా విశ్లేషణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఆర్థిక అంశాలపై సమాచారాన్ని సేకరించి, ఆ తర్వాత దాన్ని విశ్లేషించేందుకు నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. బీమా కంపెనీలు, బ్యాంకులు దివాళా తీయకుండా ఉండేందుకు ప్రత్యేక సమగ్ర కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆహార పదార్థాల్లో వంద శాతం ఎఫ్‌డీఐని ప్రవేశపెట్టనున్నారు. ఎక్సైజ్ పన్ను నుంచి బీడీలకు మినహాయింపు ఇచ్చారు.
 
ముఖ్యాంశాలు: 
గ్రామీణాభివృద్ధికి రూ. 87,765 కోట్లు
వ్యవసాయ రంగానికి రూ. 35,985 కోట్లు
వచ్చే ఐదేళ్లలో సాగునీటి కోసం రూ. 86,500 కోట్లు
వ్యవసాయ రంగానికి రూ. 35,985 కోట్లు
వచ్చే ఐదేళ్లలో సాగునీటి కోసం రూ. 86,500 కోట్లు
రూ. 27 వేల కోట్లతో 2.23 లక్షల కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం
ఉపాధి హామీ పథకానికి రూ. 38,500 కోట్లు
రూ. 27 వేల కోట్లతో 2.23 లక్షల కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం
అణు విద్యుత్ కోసం రూ.3000 కోట్లు
ఉపాధి హామీ పథకానికి రూ. 38,500 కోట్లు
ఉన్నత విద్యకు రూ.1000 కోట్లతో కార్పస్ ఫండ్
మే 2018 నాటికి 18,500 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం
స్టార్టప్ ఇండియాకు రూ. 500 కోట్ల కేటాయిస్తున్నట్లు అరుణ్ జైట్లీ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి