బడ్జెట్ 2016-17: 2022 కల్లా వ్యవసాయాధారిత ఆదాయం రెట్టింపు: జైట్లీ

గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్లకు 2వేల కోట్లు: అరుణ్ జైట్లీ

సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (11:50 IST)
2022 కల్లా వ్యవసాయాధారిత ఆదాయాన్ని రెట్టింపు చేయాలనుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్లకు 2వేల కోట్లు కేటాయిస్తామన్నారు. గ్రామాల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందిస్తున్నట్లు తెలిపారు. 2016-17 సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ని పార్లమెంట్లో జైట్లీ సోమవారం ప్రవేశపెట్టారు. 
 
ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తామని జైట్లీ వెల్లడించారు. మౌలిక సదుపాయాల కల్పనపై అధిక పెట్టుబడులు పెట్టామని చెప్పుకొచ్చారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు. వ్యవసాయరంగ అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ప్రజారోగ్యం, సామాజిక రంగాలపై దృష్టి పెట్టామని అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. 
 
బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు:
* మౌలిక సదుపాయాల కల్పనపై  అధిక పెట్టుబడులు పెట్టాం 
* పన్ను సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి 
* మౌలిక సముదపాయాల కల్పనపై అధిక పెట్టుబడులు 
* ఆర్థిక రంగంలో సంస్కరణలు తీసుకొస్తాం 
* ప్రధాని పంటల బీమా యోజన ద్వారా రైతులకు భరోసా 
* ప్రధాని సించాయి యోజన ద్వారా అదనంగా 25లక్షల ఎకరాలకు సాగునీరు
* ఏడో వేతన సంఘం సిఫార్సులు, ఒకే ర్యాంకు ఒకే పింఛన్‌తో ఆర్థిక వ్యవస్థపై భారం
* గ్రామీణ, వ్యవసాయ, బ్యాంకింగ్‌ రంగాలపై దృష్టి సారిస్తాం 
* కీలక 9 సూత్రాల ఆధారంగా అభివృద్ధి 
* వ్యవసాయ రంగానికి 35,985 కోట్లు కేటాయింపు

వెబ్దునియా పై చదవండి