దేశంలోని ప్రతి పౌరునిపై రూ. 29800ల అప్పు ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ననుసరించి దేశంలోని ప్రతి పౌరునిపై దాదాపు రూ. 1177ల విదేశీ అప్పు ఉంది. అది చిన్న పిల్లవాడైనాసరే అతనిపైకూడా ఈ అప్పు ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు గృహావసరాల నిమిత్తం వాడేటటువంటి సబ్సిడీలను కూడా కలిపితే అప్పు ప్రతి భారతీయునిపై దాదాపు రూ. 29800లుగా ఉందని అంచనా.
మంత్రి ప్రణబ్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టబడిన బడ్జెట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూలంగా రూ. 2356939.58కోట్లుగా ఉంది. ఇందులో రూ. 137680.69కోట్లు విదేశీ అప్పుగా ఉందని మంత్రి ప్రకటించారు.
ఇదిలావుండగా బడ్జెట్‌ననుసరించి రానున్న ఆర్థిక సంవత్సరంలో మొత్తం అప్పు రూ. 3495152కోట్లుగా ఉంటుంది. ఇది నిరుడు ఆర్థిక సంవత్సరంలో రూ. 3135775.42కోట్లుగా ఉండిందని మంత్రి తెలిపారు.
కాగా నిరుడు ఆర్థిక సంవత్సరంలో రూ. 1216334 .12కోట్ల విదేశీ రుణం ఉండిందని ఆర్థిక మంత్రి సభలో ప్రకటించారు.