కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం లోక్‌సభలో ప్రస్తుత ఆర్థిక సంవత్సర సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రణబ్ ముఖర్జీ సభలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను 25 ఏళ్ల తరువాత తిరిగి ప్రవేశపెట్టడం గమనార్హం. వృద్ధులకు పన్ను మినహాయింపు పరిమితిని రూ.2,25,000 నుంచి రూ.2,40,000కి పెంచారు.
మహిళలకు రూ.1,80,000 నుంచి రూ.1,90,000 వేలకు పెంచారు. మిగిలినవారికి ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.1,50,000 నుంచి రూ.1,60,000కు పెంచారు. ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్సును రద్దు చేస్తున్నట్లు బడ్జెట్ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు.
కార్పొరేట్ పన్నును యథాతథంగా ఉంచారు. అన్నిరంగాలకు సమ ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా ప్రణబ్ ఈసారి బడ్జెట్‌లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. వ్యవసాయ రంగంలో రూ.3 లక్షల వరకు రుణాలను ఏడాదికి 7 శాతం వడ్డీ రేటుతో అందిస్తామని ప్రణబ్ హామీ ఇచ్చారు.
కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు :
· ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రసంగాన్ని మహాత్ముని ప్రస్తావనతో ముగించారు.
· పన్ను సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
· పెట్రోల్‌తో నడిచే చిన్న ట్రక్కులపై ఎక్సైంజ్ సుంకం 10 శాతం తగ్గింపు
· నిర్మాణ ప్రదేశాల్లో తయారు చేసే వస్తువులపై సుంకం మినహాయింపు పునరుద్ధరణ
· చౌక వస్త్రాల ఫైబర్‌పై ఎక్సైంజ్ సుంకం తగ్గింపు
· హృద్రోగాల మందుల రేట్లు తగ్గే అవకాశం
· బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకం పెంపు
· మొబైల్ ఫోన్ ఉపకరణాలు ధరల తగ్గే అవకాశం
· మహిళల బ్రాండెడ్ ఆభరణాల ధరలు కూడా తగ్గే అవకాశం
· బయో- డీజిల్‌పై కస్టమ్స్ సుంకం తగ్గింపు
· వస్త్ర యూనిట్లకు ట్యాక్స్ హాలిడే పొడిగింపు
· ముందస్తు పన్ను నుంచి చిన్న వ్యాపారాలకు మినహాయింపు
· ఎస్‌సీడీ ప్యానళ్లపై కస్టమ్స్ సుంకం సగానికి తగ్గింపు
· సెటాప్ బాక్స్‌ల ధర పెరిగే అవకాశం
· సంఘసేవా సంస్థలకు వచ్చే గుర్తుతెలియని నిధులకు కొంత పన్ను ఊరట
· సరుకుల లావాదేవీల పన్ను రద్దు చేస్తారు
· బుక్ ప్రాఫిట్‌లో 15 శాతానికి ఎంఏటీ పెంపు
· ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ రద్దు చేసే అవకాశం
· వ్యక్తిగత ఆదాయ పన్నుపై 10 శాతం సర్‌చార్జి రద్దు
· మహిళల ఆదాయ పన్ను మినహాయింపు రూ.190,000కు పెంపు
· వృద్ధుల ఆదాయ పన్ను మినహాయింపు రూ.2,40,000కు పెంపు
· సాధారణ అమ్మకపు పన్ను విధానంలో సకేంద్ర జీఎస్‌టీ, రాష్ట్ర జీఎస్‌టీ (జీఎస్‌టీ- సాధారణ అమ్మకపు పన్ను) ఉంటాయి.
· 2008-09లో ప్రత్యక్ష పన్నుల వాటా 56 శాతానికి పెరుగుదల
· సాధారణ అమ్మకపు పన్ను ఏప్రిల్ 01, 2010 నుంచి అమల్లోకి వస్తుంది.
· కార్పొరేట్ పన్నులో మార్పులేమీ లేవు
· 45 రోజుల్లో కొత్త పన్ను కోడ్
· ఏప్రిల్ 1, 2010లో కొత్త వస్తు, సేవల పన్ను
· పన్ను సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
· 2009-10లో మొత్తం బడ్జెట్ వ్యయం రూ.10,28,032 కోట్లు
· కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికా వ్యయం రూ.61,000 కోట్లకు పెంపు
· 2009-10లో జీడీపీలో ఆర్థిక లోటు 6.8 శాతంగా అంచనా
· మౌలిక ప్రాజెక్టుల్లో అధిక ప్రభుత్వ పెట్టుబడులు
· రక్షణ వ్యయం కూడా పెంపు
· పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఐలా తుపాను భాదితుల పునరావాసానికి రూ.1000 కోట్లు
· ముర్షిదాబాద్, మల్లాపురం ఏఎంయూ క్యాంపస్‌లకు చెరో రూ.25 కోట్ల నిధులు
· ఐఐటీలు, ఎన్ఐటీల కోసం రూ.2113 కోట్ల నిధులు
· ఖనిజాల అన్వేషణను విస్తృతపరిచేందుకు జీఎస్ఐకి నిధులు
· 12 లక్షల మంది జవాన్లు, జీసీవోలకు కొత్త పెన్షన్ ప్రయోజనాలు
· నాన్- కమిషన్డ్ అధికారుల పెన్షన్ పెంపు
· లంక తమిళుల పునరావాసానికి నిధుల కేటాయింపు
· పారామిలిటరీ దళాల కోసం లక్ష గృహాల నిర్మాణం
· కామన్వెల్త్ క్రీడల కోసం నిధుల కేటాయింపు రూ.3472 కోట్లకు పెంపు
· చండీగఢ్ విశ్వవిద్యాలయానికి రూ.50 కోట్ల నిధులు
· జాతీయ గంగ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు రూ.562 కోట్లకు పెంచనున్న ప్రభుత్వం
· జులై 1 నుంచి మాజీ ఆర్మీ సిబ్బందికి ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ పథకం
· రక్షణ సిబ్బందితో సమానంగా పారామిలిటరీ దళాల భత్యాలు
· ఐడీ ప్రాజెక్టు 12- 18 నెలల్లో పట్టాలపైకి
· ప్రైవేట్ టాలెంట్‌కు ఐడీ ప్రాజెక్టుకి గుర్తింపు
· ఎన్ఆర్‌హెచ్ఎం కేటాయింపులు రూ.257 కోట్లకు పెంపు
· వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక
· గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో విద్యార్థులకు పూర్తి వడ్డీ సబ్సిడీ
· జాతీయ ఉద్యోగకల్పనా కార్యాలయాల ఆధునికీకరణ
· స్వయంసహాయ బృందాల్లో 50 శాతం గ్రామీణ మహిళలు
· బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గ్రామీణ మెగా క్లస్టర్లు
· రూ.1 లక్షలోపు గృహ రుణాలపై వడ్డీ సబ్సిడీ
· విద్యా రుణాలపై పూర్తి వడ్డీ మాఫీ
· మహిళల, శిశు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఆర్ఎంకే (రాష్ట్రీయ మహిళా కోష్) మూలనిధి రూ.500 కోట్లకు పెంపు
· నేషనల్ హౌసింగ్ బ్యాంకు పరిధిలో గ్రామీణ గృహకల్పన నిధి రూ.2000 కోట్ల నిధులు
· మహిళా అక్షరాస్యతకు జాతీయ సంఘం
· ఎన్ఆర్ఈజీఏ కేటాయింపులు 144 శాతం పెంపు
· సబ్సిడీ ఆహారం కోసం జాతీయ ఆహార భద్రతా పథకంపై దృష్టి
· బ్యాంకు సేవలు అందుబాటులోలేని ప్రాంతాల్లో బ్యాంకుల విస్తరణకు రూ.100 కోట్ల వన్ టైమ్ గ్రాంటు
· ఇందిరా అవాస్ యోజనకు కేటాయించబడిన నిధులు 63 శాతం పెరిగి, రూ.8,883 కోట్లకు చేరాయి.
· ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనాకు నిధుల కేటాయింపు 59 శాతం పెంపు
· ఎన్ఆర్ఈజీఏకు రూ.39100 కోట్ల నిధులు
· 4.47 కోట్ల కుటుంబాలకు ఎన్ఆర్ఈజీఏ ద్వారా ఉపాధి అవకాశాలు
· అన్ని యూపీఏ పథకాల్లో అమ్ ఆద్మీకి ప్రాధాన్యత
· బ్యాంకింగ్ నెట్‌వర్క్ విస్తరణ
· ప్రతి బ్లాకులోనూ ఒక బ్యాంకు కేంద్రం
· బ్యాంకులు, బీమా రంగాలు ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయి. ప్రైవేట్ పరం చేయబోమని ప్రణబ్ ఉద్ఘాటన
· ఇందిరా గాంధీ బ్యాంకుల జాతీయకరణను స్మరించిన ప్రణబ్
· సమగ్ర ఇంధన చట్టం ద్వారా ఇంధన భద్రతకు పెద్దపీట
· పన్ను ప్రక్రియను సరళతరం చేసేందుకు సరళ్- 2 ఫామ్‌లు
· పెట్రోలియం ఉత్పత్తుల ధరల పరిశీలనకు నిపుణుల కమిటీ
· అంతర్జాతీయ ధరలతో దేశీయ చమురు ధరల సమకాలీకరణ
· కృత్రిమ ఎరువుల సబ్సిడీ రైతులకు నేరుగా అందేలా చర్యలు
· బడ్జెట్ ప్రసంగంలో కౌటిల్యుని ప్రస్తావన
· రైతుల రుణాల వడ్డీ రేట్లలో ప్రోత్సహకాలు
· ఫ్రింట్ మీడియా ఉద్దీపన ప్యాకేజీలు మరో ఆరు నెలల పొడిగింపు
· వ్యవసాయ రుణాల లక్ష్యం 2009-10లో రూ.3,25,000 కోట్లకు పెంపు
· గత కొన్ని నెలలుగా భారత్‌వైపు మళ్లీ దృష్టిసారించిన విదేశీ సంస్థాగత మదుపుదార్లు
· వరద నీరు డ్రైనేజ్ ప్రాజెక్టు నిధులు రూ.500 కోట్లకు పెంపు
· జాతీయ గ్యాసు గ్రిడ్‌కు బ్లూప్రింట్
· రైతులకు అదనపు బడ్జెట్ కేటాయింపులు
· రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి నిధుల కేటాయింపు 30 శాతం పెంపు
· 08-09లో మొత్తం ఉద్దీపన చర్యలు విలువ రూ. 1,86,000 కోట్లు
· ముంబయి వరదనీటి నిర్వహణకు కేటాయింపుల పెంపు
· రాజీవ్ ఆవాస్ యోజనా పథకం కింద గృహాల కేటాయింపు విస్తరణ
· పట్టణ పేదల వసతికి నిధుల కేటాయింపు 3,973,000 కోట్లు
· జేఎన్ఎన్‌యూఆర్ఎం కేటాయింపుల్లో 87 శాతం వృద్ధి
· ఎన్‌హెచ్ఏఐ కేటాయింపులు 23 శాతం పెంపు
· మౌలిక సౌకర్యాల పెట్టుబడులను 2014 నాటికి జీడీపీలో 9 శాతానికి చేర్చే లక్ష్యం
· పీపీపీలో 60 శాతం కమర్షియల్ బ్యాంకు రుణాలకు ఐఐఎఫ్‌సీఎల్ రీఫైనాన్స్
· కొత్త ప్రాజెక్టులపై కూడా ఐఐఎఫ్‌సీఎల్ దృష్టి
· బ్యాంకుల ఇంక్రిమెంటల్ లెండింగ్‌పై కూడా ఐఐఎఫ్‌సీఎల్ దృష్టి సారిస్తుంది
· మౌలిక అవసరాలపై దృష్టిసారించేందుకే ఐఐఎఫ్‌సీఎల్ ఏర్పాటు
· సెప్టెంబరులో మందగమనం తరువాత రెండు ప్రతికూల త్రైమాసికాలు గడిచిపోయాయి
· దేశీయ పరిశ్రమలో పునరుత్తేజం సంకేతాలు
· ఆర్థిక ఉద్దీపన చర్యలు ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చాయి
· అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంతో పోరాడేందుకు ప్రభుత్వం మూడు ఉద్దీపన పథకాలు ప్రకటించింది.
· కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి కృషి ఫలితమే ఆర్థికాభివృద్ధి
· విదేశీ పెట్టుబడుల్లో గణనీయమైన వృద్ధి
· 2008లో వస్తు, సేవల వాణిజ్యం రెట్టింపు అయింది
· గత దశాబ్దకాలంలో భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
· 9 శాతం వృద్ధి రేటును తిరిగి సాధించడమే యూపీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం
· ఒక్క బడ్జెట్తోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు
· ప్రజలందరికీ మెరుగైన పాలనను అందించాలి
· ఇటీవల ఎన్నికల్లో యూపీఏ విజయం సమిష్టి వృద్ధికి ఫలితం
· ఆరోగ్య రంగాన్ని పటిష్టపరచడంపై దృష్టి
· మౌలిక రంగంలో పెట్టుబడుల వృద్ధి
· దేశ యువత ఎదుర్కొంటున్న సవాళ్లు మాకు తెలుసు
· యూపీఏ ప్రజలు ఉంచిన నమ్మకాన్ని, ఇచ్చిన తీర్పును సగర్వంగా స్వీకరిస్తున్నాము.
· ప్రణబ్ ముఖర్జీకి ఇది నాలుగో కేంద్ర బడ్జెట్.