Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నోబెల్ అవార్డు గ్రహీత గోర్డీమెర్ భారత్ రాక

నోబెల్ అవార్డు గ్రహీత గోర్డీమెర్ భారత్ రాక
, బుధవారం, 12 నవంబరు 2008 (01:22 IST)
సాహిత్యంలో నోబెల్ అవార్డు గెలుచుకున్న దక్షిణాఫ్రికా రచయిత్రి గోర్డీమెర్ -84- భారత విదేశీ వ్యవహారాల శాఖ పనుపున తన రెండో నోబెల్ లారెట్ ప్రసంగాన్ని ఇవ్వడానికై ఇటీవలే భారత్ విచ్చేశారు. నోబెల్ అవార్డు గ్రహీతలతో భారత విద్యావంతులు, అభిప్రాయాలను కూడగట్టగలిగే వారు పరిచయం పెంపొందించుకోవడానికి, వర్ధమాన భారత ఉనికిని నోబెల్ ప్రముఖులకు పరిచయం చేయడానికి విదేశీ వ్యవహారాల శాఖ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా గో్ర్డీమెర్ భారత్ విచ్చేశారు.

1991లో సాహిత్యంలో నోబెల్ అవార్డు గెలుచుకున్న గోర్డీమెర్ ప్రపంచీకరణకు బద్ధ వ్యతిరేకురాలిగా పేరొందారు. ప్రపంచంలో పేద, ధనికుల మధ్య ఆంతరాన్ని పూడ్చలేని స్వభావంతో ఉంటే పలు వ్యాపార ఒప్పందాల పుట్టే ప్రపంచీకరణ అని ఆమె ధ్వజమెత్తుతుంటారు.

ప్రపంచంలో ఉన్న అంతరాలకు సంబంధించి కీలకాంశాన్ని ప్రపంచీకరణ అస్సలు పట్టించుకోదని ఆమె అంటుంటారు. జాతి పరంగా విభజింపబడ్డ దక్షిణాఫ్రికాలో తలెత్తుతున్న మానసిక, నైతిక ఉద్రిక్తతలను గోర్డీమెర్ రచనలు ఎత్తి చూపుతుంటాయి.

దక్షిణాఫ్రికా రచయితల కాంగ్రెస్‌కు ఆమె సంస్థాపక సభ్యురాలు. అలాగే తన దేశంలో కొనసాగిన జాతివివక్షా వ్యతిరేక ఉద్యమాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు కూడా.

అమెరికా నూతన అధ్యక్షుడిగా బరాక్ ఒబామా సాధించిన విజయం జాతివివక్షను అంతమొందించిన ఘటనగా దక్షిణాఫ్రికా నోబెల్ అవార్డు గ్రహీత నడీన్ గోర్డీమెర్ కొనియాడారు. తన రెండవ నోబెల్ అవార్డు ప్రసంగం చేయడానికి భారత్‌కు విచ్చేసిన గోర్డీమెర్ అమెరికా అధ్యక్ష పీఠమెక్కిన ఒబామా విజయంతో జాతివివక్షకు అంతం పలికినట్లుగా ఉందని పేర్కొన్నారు.

ఇప్పుడతను నల్లజాతి మనిషిగా అమెరికాలో వెలిగిపోతుండవచ్చని ఆమె అన్నారు. అమెరికా వంటి అత్యంత శక్తి సంపన్నమైన దేశంలో నల్లజాతి అధ్యక్షుడిగా ఒబామా అవతరించడంతో మనందరిపై ఉన్న జాతి ఆధిపత్యం తొలగిపోయినట్లుగా ఉందని ఆమె చెప్పారు.

వాస్తవానికి ఒబామా సగం నలుపు, సగం తెలుపు రంగుతో ఉన్న మనిషని గోర్డీమెర్ చెప్పారు. అయితే ఇది మానవజాతి ఒకటేనని చెప్పడానికి మనందరికీ సంకేతంలా కనిపిస్తోందని ఆమె అన్నారు. మరోలా చెప్పాలంటే ఒబామా స్వంత డీఎన్ఎ, అతడి రక్త నమూనా ద్వారా ఇప్పుడు జాతివివక్షకు అంతమైపోయిన ఘటనను మనందరం చూస్తున్నామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu