Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చర్మ రక్షణకు చలికాలంలో ఎలాంటి ఆయిల్స్ వాడాలో తెలుసా?

శీతాకాలం వచ్చిందంటే చర్మం పగులుతూ ఉంటుంది కొందరి. కనుక చలికాలంలో చర్మానికి రక్షణ అవసరం. చలికాలంలో పడిపోయే ఉష్ణోగ్రత, వీచే చలిగాలులు చర్మాన్ని ఇబ్బంది పెడతాయి. అందుచేత కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, నువ్వుల నూనెలను రాయడం ద్వారా చర్మం నునుపుగ

చర్మ రక్షణకు చలికాలంలో ఎలాంటి ఆయిల్స్ వాడాలో తెలుసా?
, మంగళవారం, 27 డిశెంబరు 2016 (21:08 IST)
శీతాకాలం వచ్చిందంటే చర్మం పగులుతూ ఉంటుంది కొందరి. కనుక చలికాలంలో చర్మానికి రక్షణ అవసరం. చలికాలంలో పడిపోయే ఉష్ణోగ్రత, వీచే చలిగాలులు చర్మాన్ని ఇబ్బంది పెడతాయి. అందుచేత కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, నువ్వుల నూనెలను రాయడం ద్వారా చర్మం నునుపుగా తయారవుతుంది. 
 
కొబ్బరి నూనెలో లవణాలు అధికం. కాబట్టి కొబ్బరి నూనె శరీరానికి రాసుకుంటే ముడతలు రాకుండా కాపాడుకోవచ్చు. చర్మం ఎలాంటిదైనా కొబ్బరినూనె వాడొచ్చు. ఆలివ్ ఆయిల్ చర్మ సౌందర్యానికి చక్కని సాధనం. దీనిలోని విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మం వయసుతో వచ్చే మార్పులకు గురికానివ్వదు. ఆలివ్ నూనె మర్దనతో చర్మం ఎంతో సౌందర్యంగా, ఆకర్షణీయంగా తయారవుతుంది. 
 
ఆల్మండ్ ఆయిల్.. చర్మాన్ని ఎండిపోనివ్వదు. ఈ నూనె రాసుకుంటే చర్మం తేమను గ్రహిస్తుంది. దురద, మంట వంటి చర్మ సమస్యలకు ఆల్మండ్ ఆయిల్ చెక్ పెడుతుంది. నువ్వులనూనెలోని విటమిన్ బి,ఇలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కాల్షియమ్, మెగ్నీషియమ్‌ల ద్వారా చర్మం లబ్ధిపొందుతుంది. సూర్య కాంతి ప్రభావం చర్మం మీద పడకుండా కాపాడుతుంది. నువ్వుల నూనె మర్దన చేసుకుంటే అలసట మాయమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేపలను తినాలంటే.. వేయించకూడదు.. బేక్ చేసి బాయిల్ చేసి తినాలి..