Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫంక్షన్‌కి వెళ్ళాలా.. టైమ్ లేదా.. అయితే టమోటా గుజ్జు, మిల్క్ ప్యాక్ ట్రై చేయండి!

తాజా పండ్ల చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. సహజమైన, కాంతివంతమైన చర్మం కోసం ఇంట్లో ఎల్లప్పుడూ ఉండే టమాటాను వాడుకుంటే మంచి ఫలితాన్ని రాబట్టుకోవచ్చు. టమోటా గుజ్జుకు కాస్త ఓట్స్ పొడి, పెరుగు కలిపి ముఖా

ఫంక్షన్‌కి వెళ్ళాలా.. టైమ్ లేదా.. అయితే టమోటా గుజ్జు, మిల్క్ ప్యాక్ ట్రై చేయండి!
, మంగళవారం, 2 ఆగస్టు 2016 (11:42 IST)
తాజా పండ్ల చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. సహజమైన, కాంతివంతమైన చర్మం కోసం ఇంట్లో ఎల్లప్పుడూ ఉండే టమాటాను వాడుకుంటే మంచి ఫలితాన్ని రాబట్టుకోవచ్చు. టమోటా గుజ్జుకు కాస్త ఓట్స్ పొడి, పెరుగు కలిపి ముఖానికి, మెడకు పట్టింది పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మంపై ఉన్న మలినాలు తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.
 
బిజీ సమయంలో, టైము లేదు అనుకుంటే టమోటాల గుజ్జుని రెండు టేబుల్ స్పూన్ పాలతో కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అలాగే టమోటా గుజ్జు, నిమ్మరసం కలిపి ముఖానికి మెడకు పట్టించి పావు గంట తర్వాత కడిగేస్తే చర్మంపై ఉన్న నల్లటి మొటిమలు తగ్గిపోతాయి. ముఖంపై నల్లటి మచ్చలు ఇబ్బంది పెడుతుంటే ముల్తానీ మట్టీ, టమాటా గుజ్జు కలిపి ముఖానికి రాసుకుని మెల్లగా రుద్దాలి. ఎక్కువగe రుద్దితే శరీరం ముడతలు పడిపోతుంది. ఆపై 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని ఆస్వాదించవచ్చు.
 
మంచి అందమైన కాంతివంతమైన చర్మం కోసం గంధం పొడిని టమాటా గుజ్జుతో కలిపి కొంచెం నిమ్మరసం వేసి ఆ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ప్రభావం చూపిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలూ శరీరాకృతిని ఫిట్‌గా ఉంచుకోవాలా? ఐతే మానసిక ఆరోగ్యం ముఖ్యమండోయ్!