Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంట్లో పనిచేసే మహిళలు చేతులు ఎలా వున్నాయో చూశారా?

చాలామంది మహిళలు ఇంటి పనిలో నిమగ్నమయిపోయి వారి ఆరోగ్యం, అందం గురించి అసలు పట్టించుకోరు. దీనివలన వారి చర్మం కాంతి విహీనంగా, పొడిబారినట్లు తయారవుతుంది. ముఖ్యంగా వంటపని ఎక్కువుగా చేసేవారిలో చేతులు మృదుత్వాన్ని కోల్పోయి నిర్జీవంగా తయారవుతాయి. ఈ సమస్యను అధ

Advertiesment
tips for house wives
, శనివారం, 14 జులై 2018 (19:22 IST)
చాలామంది మహిళలు ఇంటి పనిలో నిమగ్నమయిపోయి వారి ఆరోగ్యం, అందం గురించి అసలు పట్టించుకోరు. దీనివలన వారి చర్మం కాంతి విహీనంగా, పొడిబారినట్లు తయారవుతుంది. ముఖ్యంగా వంటపని ఎక్కువుగా చేసేవారిలో చేతులు మృదుత్వాన్ని కోల్పోయి నిర్జీవంగా తయారవుతాయి. ఈ సమస్యను అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటో చూద్దాం.
 
1. వేడి నీళ్లు : చేతులు నీళ్లలో ఎక్కువుగా నానడం మంచిదికాదు. అలాగే చేతుల్ని పదేపదే చల్లటి నీళ్లలోనూ ఉంచకూడదు. ఎక్కువ పనులు చేసేవారు చేతులు కడుక్కోవడానికి గోరువెచ్చని నీరు వాడటం మంచిది.
 
2. క్రీంలు : చేతులకు రాసుకునే క్రీంలు ఎప్పుడూ బ్యాగ్‌లోనే ఉండాలి. ప్రతి మూడు, నాలుగు గంటలకోసారి రాసుకుంటూ ఉండాలి. దీనివల్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోకుండా ఉంటుంది.
 
3. నూనె : పనులు ఎక్కువుగా చేసేవారు ప్రతిరోజు రాత్రి పూట పడుకునే ముందు చేతులకు, వేళ్లకు కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనెతో మర్దన చేయాలి. కాసేపయ్యాక గ్లవుజులు వేసుకోవాలి. మర్నాడు చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వలన రోజంతా పనిచేసి బరకగా మారిన చేతులకు తేమ అంది ఆరోగ్యంగా ఉంటాయి.
 
4. పెట్రోలియం జెల్లీ : ఇప్పటికే చేతులు బాగా బరకగా మారి, మృదుత్వాన్ని కోల్పోయి ఉంటే మాత్రం వాటికి ఎంత తేమ అందిస్తుంటే అంత మంచిది. ముఖ్యంగా పెట్రోలియం జెల్లీ బాగా రాయాలి. ఇది జిడ్డుగా ఉండటం వల్ల పొడిబారిన సమస్య తగ్గుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మామిడిపండుతో కుల్ఫీనా? ఎలా చేయాలో చూద్దాం?