Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చర్మ సంరక్షణకు పాటించాల్సిన చిట్కాలివే..?

చర్మ సంరక్షణకు పాటించాల్సిన చిట్కాలివే..?
, శనివారం, 24 నవంబరు 2018 (16:12 IST)
వాహనాల సంఖ్య నానాటికి పెరిగిపోవడంతో కాలుష్యం అధికమైపోతుంది. వాహనాల మీద ప్రయాణించే మహిళలు కాలుష్యం కారణంగా ముఖఛాయను కోల్పోవడం వంటి సమస్యలు ఎదుర్కుంటారు. అందుకోసం ఎవరు సలహా ఇచ్చినా తక్షణమే పాటిస్తారు. తెలిసీ తెలియని వారి సలహాలను పాటించడం వల్ల వేరొక సమస్య తలెత్తవచ్చునని బ్యూటిషన్లు పేర్కొంటున్నారు.
 
ఇలాంటి వారికోసం కొన్ని చిట్కాలు... ఏసీ రూముల్లో ఉండే వారికి తొందరగా చర్మం ముడతలు పడుతుంది. ఏసీ రూముల్లో ఉండేవారు మిగిలిన వారి కంటే అధికంగా పాలు, పెరుగు, పండ్లు, మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలి. సాధారణ ప్రాంతాల్లో గలవారు సమతుల్య ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా మాంసకృత్తులు, పోషక పదార్థాలు అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
 
రోజూ కనీసం ఆరు గంటలు కంటి నిండా నిద్రపోవాలి. ఉప్పు, కారం, చింతపండు మరీ ఎక్కువగా వాడకూడదు. కోపం, ఉద్రేకం, విసుగు, ఒత్తిడి వంటివి దరిచేరనీయకూడదు. సంతోషం మినహాయించి ప్రతికూల భావోద్వేగాలు చర్మంపై దుష్ర్పభావం చూపుతాయని వారు చెబుతున్నారు. వారానికోసారి నాణ్యమైన స్కిన్ నరిషింగ్ ఉపయోగించాలి. ఫేషియల్, బ్లీచ్ రసాయనాలతో చేసిన కాస్మెటిక్స్ ఎక్కువగా వాడకూడదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ భాగంలో నల్ల మచ్చలుంటే..?