జుట్టు ఒత్తుగా పెరగాలంటే బియ్యం కడిగిన నీళ్లు వాడితే ఫలితం!
సాధారణంగా మహిళలు శిరోజాల అందంపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. ముఖ్యంగా.. పొడవుగు, ఒత్తుగా పెంచుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఇందుకోసం బ్యూటీపార్లకు కూడా వెళుతుంటారు. అయితే, చైనా దేశంలోని యావో తెగ మ
సాధారణంగా మహిళలు శిరోజాల అందంపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. ముఖ్యంగా.. పొడవుగు, ఒత్తుగా పెంచుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఇందుకోసం బ్యూటీపార్లకు కూడా వెళుతుంటారు. అయితే, చైనా దేశంలోని యావో తెగ మహిళలు మాత్రం ఇలాంటి వాటికి పూర్తి విరుద్ధం.
ఈ తెగ ప్రజలు తమ జీవిత కాలంలో ఒక్కటంటే ఒక్కసారి కూడా జుట్టు కత్తిరించుకోరట. అందుకే వీరి జట్టు పొడవు ఏడు నుంచి పది అడుగుల వరకు ఉంటుంది. అయితే, వీరంతా జట్టు పెరగడానికి, ఒత్తుగా ఉండటానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా. జుట్టును ఒత్తుగా పెరగడానికి ఆ మహిళలు బియ్యం కడిగిన నీళ్లను వాడతారట. జుట్టు ఒత్తుగా పెరగాలంటే యావో మహిళలు పాటిస్తున్న చిట్కా ఫలిస్తుందేమో!