చర్మకాంతి కోసం పుదీనా పేస్ట్ ప్యాక్ వేసుకోండి..
పుదీనా పేస్ట్‌లో బాదం నూనె కలుపుకోండి. మీ మిశ్రమంలో తగినంత వేడినీటిలో కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే చర్మకాంతి పెరుగుతుంది.
చర్మకాంతిని మెరుగు పరచుకునేందుకు రాత్రి వేళలో పడుకునే ముందు తప్పనిసరిగా ముఖాన్ని శుభ్రపరచుకోండి. దీనికోసం సబ్బును ఉపయోగించకూడదు. సబ్బులో ఉండే గాఢ రసాయనాలు చర్మానికి హాని చేస్తాయి.
చర్మకాంతి కోసం సన్ ఫ్లవర్ ఆయిల్ పది చుక్కలు లేదా నువ్వుల నూనెలో రెండు చెంచాల పాలను కలిపి ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం పొడి చర్మంకల వారికి బాగా ఉపయోగపడుతుంది.
పుదీనా పేస్ట్‌లో బాదం నూనె కలుపుకోండి. మీ మిశ్రమంలో తగినంత వేడినీటిలో కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే చర్మకాంతి పెరుగుతుంది.