Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హెయిర్‌ డై వేసుకునేవారు పాటించాల్సిన జాగ్రత్తలు

హెయిర్‌ డై వేసుకునేవారు పాటించాల్సిన జాగ్రత్తలు
, సోమవారం, 20 డిశెంబరు 2021 (21:43 IST)
హెయిర్‌డై వేసుకునేవారు ఇప్పుడు ఎక్కువమందే వుంటున్నారు. కనీసం నడివయసుకి కూడా చేరకముందే తెల్లవెంట్రుకలు వచ్చేస్తున్నాయి. దీనితో హెయిర్ డై వేసుకోవడం మొదలుపెడుతున్నారు.
 
 
ఐతే ఇలా తలకు రంగు వేసుకునేటపుడు సరైన జాగ్రత్తలు పాటించకపోతే అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. రంగు వేసుకునేటప్పుడు జుట్టుకు హాని జరగకుండా ఆరోగ్యంగా ఉండే హెయిర్‌ప్యాక్ వేసుకుంటే మంచిది. రసాయనాలు లేని షాంపూలు ఎంచుకోవాలి. ముఖ్యంగా సల్ఫేట్ లేకుండా చూసుకోవాలి. సల్ఫేట్ వల్ల రంగు త్వరగా పోతుంది. అలాగే తరచూ తలస్నానం చేయడం కూడా సరికాదు. వారంలో రెండుసార్లకు మించి తలంటుకోకపోవడం మేలు. 

 
ప్రొటీన్లు అధికంగా ఉండే కండిషనర్లనే ఎంచుకోవాలి. ఇవి రంగు కోల్పోకుండా చూడటమే కాదు. జుట్టుకు బలన్నిస్తాయి. మృదువుగా మారుస్తాయి. కృత్రిమ రంగుల్ని వాడుతున్నప్పుడు డ్రయర్‌కు ఎంతదూరంగా ఉంటే అంత ఉత్తమం. తలస్నానం చేయడానికి ముందు తప్పనిసరిగా కొబ్బరినూనె రాసుకోవాలి. ఇది జుట్టుకు రంగు పట్టి ఉండేలా తోడ్పడుతుంది. జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు చర్మానికి తగలకూడదు. 
 
ముందుగా ముఖానికి, చెవులకు మాయిశ్చరైజర్, లేదంటే నూనె రాసుకొని తర్వాత డై వేసుకోవాలి. జుట్టు మంచి స్మెల్‌ రావాలంటే హెయిర్‌ సీరమ్, లేదంటే హెయిర్‌ స్ప్రేలు వాడాలి. అయితే ఈ సీరమ్స్, స్ప్రేలు మాడుకు, జుట్టు కుదుళ్లకు తగలకుండా జాగ్రత్తపడాలి. లేదంటే వీటిలో ఉండే గాఢ రసాయనాలు వెంట్రుక కుదురును దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్తమా సమస్య వున్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి