Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆలు జ్యూస్‌తో జుట్టుకు ఎంత మేలో తెలుసా?

Advertiesment
Potato
, ఆదివారం, 9 ఫిబ్రవరి 2020 (15:33 IST)
ఆహారపు అలవాట్లలో తేడా, నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం కారణంగా జుట్టు రాలిపోవడం సహజమైంది. అలాగే రసాయనాలు కలిపిన షాంపులు వాడటం ద్వారా కేశాలకు ముప్పు తప్పదు. అయితే బంగాళాదుంపల రసంతో కేశాలను సంరక్షించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

కేశాల సంరక్షణకు ఇది మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులో పోషకాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఆలూ రసాన్ని మాడుకు పట్టించి మసాజ్ చేయడం ద్వారా జుట్టు పెరుగుతుంది. జుట్టు వత్తుగా పెరుగుతుంది. ఆలు రసంలో స్టార్చ్ వుండటం ద్వారా జుట్టు రాలదు. 
 
జుట్టు వత్తుగా పెరగాలంటే.. ఆలూ రసాన్ని, నిమ్మరసాన్ని చేర్చి మాడుకు రాయడం ద్వారా జుట్టు వత్తుగా పెరుగుతుంది. మాడుపై తేమ నిలుస్తుంది. నిమ్మరసం,  బంగాళాదుంపల రసాన్ని సమానంగా తీసుకుని మాడుకు రాయడం ద్వారా జుట్టు రాలే సమస్యంటూ వుండదు. ఆలూ రసాన్ని 15 నిమిషాల పాటు మాడుకు పట్టించి మసాద్ చేస్తే రక్తప్రసరణ మెరుగవుతుంది. 
 
ఈ రసాన్ని జుట్టుకు రాస్తే.. జుట్టు వత్తుగా పెరుగుతుంది. ఇలా ఆలు రసాన్ని జుట్టుకు పట్టించి.. గోరు వెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేయాలి. మాసానికి మూడుసార్లు ఇలా చేయడం ద్వారా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆలును శుభ్రం చేసుకుని శుభ్రం చేసుకుని.. తురుముకోవాలి. తర్వాత ఆ తురుమును మిక్సీలో రుబ్బుకుని వడగట్టుకోవాలి. ఆపై ఆ బంగాళా జ్యూస్‌కు మాడుకు పట్టించాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధనియాల పొడి, పసుపుతో ఆ సామర్థ్యం పెరుగుతుందట..