Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంద‌మైన చ‌ర్మం కోసం లావెండర్ ఆయిల్....

మూలికలు ఆరోగ్యం, అందం విషయంలో చాలా ఎఫెక్టివ్‌గా మరియు సురక్షితంగా పని చేస్తాయి. ఈ మూలికలు, చర్మం, జుట్టు సమస్యలను తగ్గించడంతో పాటు, ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తాయి. చర్మ సమస్యలను నివారించుకోవడం కోసం పసుపును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ల్యావెండర్ మరియు

అంద‌మైన చ‌ర్మం కోసం లావెండర్ ఆయిల్....
, శుక్రవారం, 29 జులై 2016 (19:13 IST)
మూలికలు ఆరోగ్యం, అందం విషయంలో చాలా ఎఫెక్టివ్‌గా మరియు సురక్షితంగా పని చేస్తాయి. ఈ మూలికలు, చర్మం, జుట్టు సమస్యలను తగ్గించడంతో పాటు, ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తాయి. చర్మ సమస్యలను నివారించుకోవడం కోసం పసుపును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ల్యావెండర్ మరియు థైమ్ వంటి మూలికల్లో కూడా సహజ శక్తి సామ‌ర్ధ్యాలు కలిగి ఉన్నాయి. చర్మ సమస్యలను నివారించడంలో చాలా గొప్పగా పనిచేస్తాయి. చర్మానికి ప్రకాశించే గుణాలను అందిస్తాయి. 
 
* ల్యావెండర్ ఆయిల్ మంచి సువాసన కలిగి ఉంటుంది. చర్మకణాల మీద లావెండర్ ఆయిల్ చాలా ప్రభావంతంగా పనిచేసి, చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. లావెండర్ ఆయిల్‌ను నేరుగా ఉపయోగించుకోవచ్చు లేదా ఇతర పదార్థాలు జోడించి ఉపయోగించుకోవచ్చు. లావెండర్ ఆయిల్‌ను చర్మానికి ఉపయోగించడం వల్ల ఇది ముఖంలో ముడుతలను నివారించి, నయం చేసే గుణాలను మెరుగుపరుస్తుంది. మొటిమ‌లను రాకుండా పోరాడుతుంది.
 
* లావెండర్, కొబ్బరినూనె, సాల్ట్‌తో స్క్రబ్ తయారుచేసుకోవచ్చు. కొబ్బరి నూనె 1 టేబుల్ స్పూన్, ఎస్సమ్ సాల్ట్ 1/2 కప్పు లావెండర్ ఆయిల్ 10 చుక్కలను ఒక గిన్నెలో వేసి బాగా కలిపి, మూత గట్టిగా ఉండే డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి.
 
* థైమ్ ఆయిల్‌ను స్త్రీ, పురుషులిద్దరిలోనూ జుట్టు రాలడం నివారించడం కోసం ఉపయోగించుకోవచ్చు. అలాగే చండ్రు, ఇతర జుట్టు సమస్యల నివారణకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. థైమ్ ఆయిల్‌ను నేరుగా తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నిదానంగా జుట్టు రాలడం నివారించబడుతుంది.
 
* థైమ్ ఆయిల్ మొటిమలను నివారించడానికి కూడా పనిచేస్తుంది. బేకింగ్ సోడా 2 టీస్పూన్లు, థైమ్ ఆయిల్ 2 చుక్కలు, జోజోబా ఆయిల్ 1 టీస్పూన్, దానిమ్మ నూనె 3 చుక్కలను ఒక మిక్సింగ్ బౌల్‌లో తీసుకొని బాగా మిక్స్ చేయాలి. దీన్ని ఒక చల్లటి వాతావరణంలో నిల్వచేయాలి. అవసరమైనప్పుడు ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో లేపనంగా రాసుకోవాలి. ముఖం మొత్తం రాసుకోకూడదు. సున్నిత చర్మతత్వం ఉన్నవారు దీన్ని వాడ‌కూడదు. వీరికి బేకింగ్ సోడా చర్మానికి హాని కలిగిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హెచ్‌ఐవీ ముప్పు నుంచి స్త్రీలను రక్షించే ‘రింగ్‌'