Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హెచ్‌ఐవీ ముప్పు నుంచి స్త్రీలను రక్షించే ‘రింగ్‌'

భావోద్వేగాల నియంత్రణలో ముందున్నా.. సున్నితత్వానికి స్త్రీలు ప్రత్యామ్నాయం. శారీరకంగా సున్నితంగా ఉండడం వల్ల వారికి వ్యాధుల బెడద కూడా ఎక్కువే! ముఖ్యంగా ప్రాణాంతక జబ్బుల విషయంలో పురుషులతో పోలిస్తే మహిళలకే ఎక్కువ రిస్కు ఉందని ఇటీవలి అధ్యయనం ఒకటి వెల్లడిం

హెచ్‌ఐవీ ముప్పు నుంచి స్త్రీలను రక్షించే ‘రింగ్‌'
, శుక్రవారం, 29 జులై 2016 (18:35 IST)
భావోద్వేగాల నియంత్రణలో ముందున్నా.. సున్నితత్వానికి స్త్రీలు ప్రత్యామ్నాయం. శారీరకంగా సున్నితంగా ఉండడం వల్ల వారికి వ్యాధుల బెడద కూడా ఎక్కువే! ముఖ్యంగా ప్రాణాంతక జబ్బుల విషయంలో పురుషులతో పోలిస్తే మహిళలకే ఎక్కువ రిస్కు ఉందని ఇటీవలి అధ్యయనం ఒకటి వెల్లడించింది. హెచ్‌ఐవీ బారినపడే వారిలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండడమే దీనికి ఉదాహరణ అంటూ పరిశోధకులు చెబుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో మహిళలను హెచ్‌ఐవీ నుంచి రక్షించేందుకు ఇంటర్నేషనల్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫర్‌ మైక్రోబైసైడ్స్‌(ఐపీఎం) పరిశోధకులు ఓ రింగ్‌ను అభివృద్ధి చేశారు. మిగతా కారణాల మాటెలా ఉన్నా లైంగిక కలయికతోనే హెచ్‌ఐవీ ఎక్కువగా వ్యాపిస్తుందట. దీంతో వ్యాధి విస్తరణను అడ్డుకునేందుకు ఈ రింగ్‌ను యాంటీరిట్రోవైరల్‌ డ్రగ్‌తో ప్రత్యేకంగా తీర్చిదిద్దామని చెప్పారు. ఇందులోని యాంటీరిట్రొవైరల్‌ డ్రగ్‌ హెచ్‌ఐవీ కణాలను సమర్థవంతంగా అడ్డుకుంటుందని వివరించారు. దీంతో హెచ్‌ఐవీ ముప్పు నుంచి దాదాపు 75 శాతం వరకు తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్లడ్ ప్లేట్‌లెట్ లెవల్స్‌ను పెంచుకోవాలంటే ఏం చేయాలి?