Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీనట్ బటర్, కోకో బటర్ పెదవులకు రాస్తే.. లిప్‌స్టిక్ మంచిదే..

గులాబీరేకుల్లాంటి పెదవుల కోసం పీనట్‌ బటర్‌ లేదా కోకో బటర్ అప్లయి చేయాలి. ఇలా చేస్తే పగుళ్లు పోతాయి. గులాబీ రేకులు నూరి తేనె కలిపి ఆ మిశ్రమాన్ని పెదవులకు రాస్తే నలుపు పోతుంది. గులాబీ రేకుల్ని నూరు అందు

Advertiesment
Lip stick protect lips
, బుధవారం, 19 అక్టోబరు 2016 (13:25 IST)
గులాబీరేకుల్లాంటి పెదవుల కోసం పీనట్‌ బటర్‌ లేదా కోకో బటర్ అప్లయి చేయాలి. ఇలా చేస్తే పగుళ్లు పోతాయి. గులాబీ రేకులు నూరి తేనె కలిపి ఆ మిశ్రమాన్ని పెదవులకు రాస్తే నలుపు పోతుంది. గులాబీ రేకుల్ని నూరు అందులో పాలమీగడ కలిపి రాస్తే పెదవులు పగలడం వల్ల తగ్గిపోతుంది. 
 
ఇంకా పాలమీగడలో గ్లిజరిన్‌ రెండు చుక్కలు కలిపి రాస్తే పెదవులు మృదువుగా తయారవుతాయి. ఇంకా రోజువారీ తీసుకుంటున్న ఆహారంలో ‘బివిటమిన్‌, ‘సి విటమిన్‌ జింక్‌ గల పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. జాజి కాయ పొడి, పసుపు, నెయ్యి సమభాగములుగా తీసుకుని పెదవులకు రాస్తే పగుళ్లు పోతాయి. మంచి బ్రాండ్ లిప్ స్టిక్స్ పెదవులకు కవచం లాంటివే. 
 
లిప్‌స్టిక్‌ అప్లయి చేసే ముందు కోల్డ్‌ క్రీమ్‌గాని మాయిశ్చరైజర్‌ లోషన్‌ గాని అప్లయి చేసి తరువాత లిప్‌స్టిక్‌ అప్లయి చేస్తే మంచిది. వెన్నపూస రాస్తే పెదవుల పగుళ్లు పోతాయి. మార్కెట్‌లో దొరికే  చాప్‌స్టిల్‌ అప్లయి చేసినా పెదాలు పగలవని బ్యూటీషన్లు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏ పదార్థాల్లో ఏ విటిమిన్లు ఉంటాయంటే...?