చాలామంది స్త్రీలు తరచు ఒత్తైన జుట్టుకోసం నిత్యం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కువగా బయట దొరికే పదార్థాలు ఎక్కువగా వాడుతుంటారు. వీటి వాడకం వలన సమస్య ఎక్కువవుతుందే కానీ, కాస్త కూడా తగ్గడం లేదని సతమతమవుతుంటారు. అందువలన, మనకు అందుబాటులో ఉండే కలబంద ఒత్తయిన జుట్టుకు, జుట్టు పొడిబారకుండా ఉండేందుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
వెంట్రుకల మొదళ్ల నుండి అమినో ఆమ్లాలు వెలువడుతుంటాయి. ఇదే ఆమ్లమం కలబందలో పుష్కలంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని జుట్టుకు క్రమం తప్పకుండా పట్టించడం వలన జుట్టు పెరగటంతో పాటు, పొడిబారడం తగ్గుతుంది. చుండ్రును కూడా అరికడుతుంది. మరి ఈ కలబందను ఎలా ఉపయోగించాలో చూద్దాం..
పావుకప్పు కలబంద గుజ్జులో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుండి జుట్టంతా పట్టించాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచు చేయడం వలన చండ్రు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు కూడా ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంటుంది.
అరకప్పు కలబంద గుజ్జుకి స్పూన్ ఆముదం, చెంచా మెంతిపిండి కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే తలకు అప్లై చేసుకోవాలి. గంట తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా ప్రతివారం చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
తలస్నానం చేసే 10 నిమిషాల ముందు కలబంద గుజ్జును కుదుళ్లకు రాసుకోవాలి. ఈ గుజ్జులోని ఎంజైమ్‌లు తలలోని మృతకణాలను తొలగించి చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ని తొలగిస్తుంది. అంతేకాక తేమను అందించి జుట్టు పొడిబారకుండా చేస్తుంది.