ముడతలను తొలగించుకోవాలా? అరటి గుజ్జుతో ప్యాక్ వేసుకోండి..
ముడతలకు చెక్ పెట్టాలంటే.. గుడ్డు తెల్లసొనలో కొద్దిగా నిమ్మరసం, చెంచా తేనె కలుపుకుని.. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పది
ముడతలకు చెక్ పెట్టాలంటే.. గుడ్డు తెల్లసొనలో కొద్దిగా నిమ్మరసం, చెంచా తేనె కలుపుకుని.. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పది బాదం గింజలు తీసుకుని రాత్రే నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు పచ్చిపాలు పోసి మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా వేసి అరగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారంలో రెండుమూడుసార్లు చేస్తుంటే ముడతలు పెరగకుండా ఉంటాయి.
బాదంలో ‘విటమిన్ ఈ’తో పాటూ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పోషకాలు చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. అలాగే బాగా పండిన అరటి గుజ్జును ముఖానికి పట్టిస్తే ముడతలు తొలగిపోతాయి. లేదంటే.. అరటి గుజ్జుతో చెంచా పెరుగు, తేనెను కలుపుకుని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కోమలంగా మారుతుంది.