శరీరానికి సబ్బులు ఓకే కానీ.. ముఖానికి ఫేషియల్ క్లెన్సర్లు వాడండి!
సబ్బులు చేతులూ, శరీరానికి మేలు చేస్తాయి. అయితే ముఖానికి కాదనే విషయాన్ని గమనించాలి. వీటిలోని గాఢత చర్మం బరకగా మారేలా చేస్తుంది. అందుకే ముఖానికి మాత్రం ఫేషియల్ క్లెన్సర్‌ని వాడితే మంచి ఫలితం ఉంటుంది. అ
సబ్బులు చేతులూ, శరీరానికి మేలు చేస్తాయి. అయితే ముఖానికి కాదనే విషయాన్ని గమనించాలి. వీటిలోని గాఢత చర్మం బరకగా మారేలా చేస్తుంది. అందుకే ముఖానికి మాత్రం ఫేషియల్ క్లెన్సర్‌ని వాడితే మంచి ఫలితం ఉంటుంది. అది చర్మానికి తగ్గట్టు ఎంచుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేసుకునే ముందు చేతుల్ని కడుక్కోవాలి. లేదంటే చేతుల్లోని మురికీ, క్రిములు ముఖంలోకి చేరతాయి. దాంతో మొటిమలు మొదలవుతాయి.
కొందరు రోజంతా అదేపనిగా ముఖాన్ని కడుక్కుంటూ ఉంటారు. కానీ అది సరైన పనికాదు. అలా చేయడం వల్ల చర్మం పొడిబారి, నిర్జీవంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు అతిగా శుభ్రం చేయడం వల్ల కూడా చర్మంలో అధిక నూనెలు విడుదలై ఇబ్బంది పెడతాయి. ముఖాన్ని కడిగేటప్పుడు అతి వేడి నీరు, మరీ చల్లగా ఉండే నీటిని ఉపయోగించకూడదు. గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.