ఈ వేసవి కాలం వచ్చిందంటే చాలు.. సన్‌టాన్ ఇబ్బంది పెడుతుంది. టాన్ వలన చర్మం కమిలిపోయినట్టవుతుంది. దాంతో కొన్ని డ్రస్‌లు వేసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా అనిపించకుండా ఉండాలని టాన్ పోగొట్టేందుకు రసాయనాలతో కూడిన బ్లీచ్‌లు వాడుతుంటారు. ఇవి కొందరికి పడక సమస్య ఎక్కువైపోతుంది. మరి ఈ సమస్య నుండి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..
ఇంట్లో లభించే సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్స్‌ను వాడాలి. వీటిని వారానికి మూడుసార్లు క్రమంగా వాడితే చర్మం మెరిసిపోతుంది. టాన్ దూరమవుతుంది. అందుకు ఇంట్లోనే బ్లీచ్ ఎలా వేసుకోవాలో చూద్దాం..
కావలసినవి:
4 స్పూన్ల పాలు
ఒక స్పూన్ తేనె
2 స్పూన్ల నిమ్మరసం
తయారీ:
ముందుగా పై పదార్థాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని టాన్ అయిన భాగాలపై రాసుకుని పావుగంట తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. జిడ్డు చర్మం వాళ్లకి ఇది చక్కటి చిట్కా.