జుట్టు రాలితే.. కోడిగుడ్డు, గ్రీన్ టీ తీసుకోండి.. (Video)
జుట్టు రాలిపోతున్నాయా? అయితే వెంటనే డైట్‌లో కోడిగుడ్డును, గ్రీన్ టీని తీసుకోవడం మరిచిపోకండి. కోడిగుడ్డులోని మాంసకృత్తులు జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తాయి. అలాగే విటమిన్లూ కుదుళ్లకు రక్తప్రసరణ అందేలా చూస
జుట్టు రాలిపోతున్నాయా? అయితే వెంటనే డైట్‌లో కోడిగుడ్డును, గ్రీన్ టీని తీసుకోవడం మరిచిపోకండి. కోడిగుడ్డులోని మాంసకృత్తులు జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తాయి. అలాగే విటమిన్లూ కుదుళ్లకు రక్తప్రసరణ అందేలా చూస్తాయి. ఫలితంగా జుట్టు బాగా పెరుగుతుంది. ఇక గ్రీన్ టీని రోజుకు మూడు కప్పులు తీసుకోవడం ద్వారా జుట్టు బాగా పెరుగుతుంది.
ఇందులో వున్న యాంటీ యాక్సిడెంట్లు మాడుపై వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించి జుట్టు పెరిగేందుకు తోడ్పడుతుంది. అరకప్పు గ్రీన్ టీలో ఒక గుడ్డు తెల్లసొన వేసి బాగా కలిపి మాడుకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి ఓసారి లేదా మాసానికి రెండుసార్లు చేస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది.
ఇంకా కొబ్బరి, ఆలివ్ నూనెలు జుట్టుకు తగిన పోషణ అందిస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది ఈ రెండు నూనెలను సమపాళ్లలో తీసుకుని వేడి చేసి గోరువెచ్చగా వున్నప్పుడు మాడుకు పట్టించి మసాజ్ చేయాలి. అర్థగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు రాలవు. చుండ్రు సమస్య తగ్గిపోతుంది. జుట్టు వత్తుగా పెరుగుతుంది.