Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే.. కొబ్బరినూనెను రాత్రుల్లో రాసుకుని మసాజ్ చేసుకుంటే?!

కేశాలకు సహజసిద్ధ కండీషనర్‌‌గా కొబ్బరి నూనె పనిచేస్తుంది. కొబ్బరినూనె వల్ల జుట్టు సున్నితంగా, మృదువుగా మారుతుంది. ఊడకుండా కేశాలకు కుదుళ్ళకు పట్టునిచ్చేలా చేస్తుంది. జుట్టుకు నూతన మెరుపునిస్తుంది. జుట్ట

Advertiesment
Coconut oil health benefits
, మంగళవారం, 2 ఆగస్టు 2016 (11:15 IST)
కేశాలకు సహజసిద్ధ కండీషనర్‌‌గా కొబ్బరి నూనె పనిచేస్తుంది. కొబ్బరినూనె వల్ల జుట్టు సున్నితంగా, మృదువుగా మారుతుంది. ఊడకుండా కేశాలకు కుదుళ్ళకు పట్టునిచ్చేలా చేస్తుంది. జుట్టుకు నూతన మెరుపునిస్తుంది. జుట్టు పెరుగుదలకు ఉపయోగ పడుతుంది. వెంట్రుకలు ఊడిపోవటం, వెంట్రుకలు చీలిపోవటం, బలహీనపడటాన్ని నిరోధిస్తుంది. ఇది జుట్టుకు సున్నితత్వం, మరలా పెరిగే శక్తినివ్వటం, ఊడిపోవటాన్ని ఆపుతుంది. వెంట్రుకలలొ శక్తిని నింపి తల లోపల అంటే కుదుళ్ళలో మరలా బలాన్ని నింపుతుంది. చుండ్రు పోయేలా చేస్తుంది. 
 
కొబ్బరి నూనెను రోజూ రాయటం వల్ల చుండ్రును నివారిస్తుంది. కొబ్బరి నూనె జుట్టులో తేమను నింపి చుండ్రును పోయేలా చేస్తుంది. చుండ్రుతో ఇబ్బంది పడుతోంటే రోజూ రాత్రిపూట కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుని పొద్దున్నే తలస్నానం చేస్తే మంచి పలితముంటుంది. చుండ్రు త్వరగా పోతుంది. కొబ్బరి నూనె కండిషనర్‌గానే కాకుండా.. చక్కని ఔషధంగా పనిచేస్తుంది. తలలోని అంటువ్యాధుల్ని అరికడుతుంది.
 
జుట్టు చిక్కు సమస్య ఉంటే కొబ్బరినూనె చాలా మంచిది. పొడవాటి జుట్టు ఉంటే మీరు కొబ్బరి నూనే వాడటం మంచిది. చిక్కు పడిన జుట్టు దగ్గర ఒక్క కొబ్బరి నూనె చుక్క వేసి చూడండి. వేసిన వెంటనే జుట్టు‌పై అది జారి వెంటనే చిక్కు పోయి సరిగ్గా వచ్చేస్తుంది. ఒక్క వెంట్రుక కూడా ఊడకుండా చేస్తుంది. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు.. కొబ్బరి నూనె తీసుకుని దానికి రోస్ వాటర్ కలిపి రాసుకుని వెళ్తే జుట్టు ఎంతో సహజంగా అందంగా ఆరోగ్యంగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిన్న వెంటనే ఫ్రిజ్ వాటర్ తాగితే..? ఇదే జరుగుతుంది...