Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మామిడి పండ్లతో సౌందర్యం... ఈ చిట్కాలు చూడండి...

మామిడి పండ్లు తినటానికే కాదు అందం పెంచుకోవ‌డానికి కూడా ఉపయోగపడతాయి. ఈ పళ్లలోని విటమిన్లు, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం, శిరోజాలను ఆరోగ్యంగా ఉంచటానికి తోడ్పడతాయి. కాబట్టి వీలైనప్పుడల్లా మామిడి పండ్లతో ఈ సౌందర్య చికిత్సలు చేస్తూ ఉండండి.

మామిడి పండ్లతో సౌందర్యం... ఈ చిట్కాలు చూడండి...
, బుధవారం, 25 మే 2016 (21:47 IST)
మామిడి పండ్లు తినటానికే కాదు అందం పెంచుకోవ‌డానికి కూడా ఉపయోగపడతాయి. ఈ పళ్లలోని విటమిన్లు, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం, శిరోజాలను ఆరోగ్యంగా ఉంచటానికి తోడ్పడతాయి. కాబట్టి వీలైనప్పుడల్లా మామిడి పండ్లతో ఈ సౌందర్య చికిత్సలు చేస్తూ ఉండండి.
 
• చర్మ సౌందర్యం..!
పచ్చి మామిడిలో యాస్ట్రిజెంట్‌ గుణాలుంటాయి. మామిడి తొక్కలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్లు మృత కణాల్ని తొలగించి చర్మపు మెరుపును పెంచుతాయి. ఈ పళ్లలోని విటమిన్‌-సి చర్మం అడుగున కొల్లాజెన్‌ తయారీకి ఉపయోగడుతుంది. విటమిన్‌-ఎ చర్మం నుంచి జిడ్డును తగ్గించి మొటిమలు రాకుండా నియంత్రిస్తుంది. అలాగే చర్మం మీద గీతలు, ముడతలను నివారిస్తుంది. ఈ పండులోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌, స్కిన్‌ ఏజింగ్‌కు కారణమయ్యే ప్రమాదకర ఫ్రీ ర్యాడికల్స్‌ నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తాయి. చర్మ సౌందర్యానికి దోహదపడే ఇన్ని సుగుణాలున్న మామిడితో ఫేస్‌ ప్యాక్‌, స్క్రబ్స్‌ తయారు చేసుకుని వాడుకోవాలి.
 
•‘మ్యాంగో ఫేస్‌ప్యాక్‌’
3 టీస్పూన్ల మామిడి పండు గుజ్జుకు ఒక ఎగ్‌ వైట్‌, అర టీ స్పూను తేనె చేర్చి బాగా బ్లెండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ మీద అప్లై చేసి 15 నిమిషాలు ఆగి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
 
• ‘మ్యాంగో స్క్రబ్‌’
4 టేబుల్ స్పూ న్ల మామిడి పండు గుజ్జుకు అరకప్పు ఓట్స్‌,పాలు చేర్చి చిక్కటి పేస్ట్‌ను తయారు చేయాలి. దీన్ని ముఖం, మెడ మీద అప్లై చేసి మునివేళ్లతో గుండ్రంగా మసాజ్‌ చేయాలి. 15 నిమిషాలు ఆగి చన్నీళ్లతోశుభ్రం చేసుకోవాలి.
 
• శిరోజ సౌందర్యం..!
మామిడి పళ్లు తినటం వల్ల జుట్టు తెల్లబడటం తగ్గి మెరుస్తూ ఉంటుంది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు వెంట్రుకల కుదుళ్లకు పోషణను ఇచ్చి పెరగటానికి తోడ్పడతాయి. మామిడి పండులోని బి-కాంప్లెక్‌ విటమిన్లు, మినరల్స్‌ జుట్టుకు బలాన్ని ఇచ్చి చుండ్రును నివారిస్తాయి. 
 
• మెరిసే జుట్టు కోసం ‘మ్యాంగో మాస్క్‌’
మామిడి పండు గుజ్జుకు పుల్లటి పెరుగు కలిపి వెంట్రుకలకు పట్టించాలి. 30 నిమిషాలు ఆగి తలస్నానం చేస్తే చుండ్రు వదిలి జుట్టు పట్టుకుచ్చులా తయారవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా భర్త సోదరి నా మాజీ బోయ్‌ఫ్రెండును పెళ్లాడింది... ఇప్పుడేం చేయాలి?