ముడతల చర్మానికి.. కొబ్బరినూనె, వంటసోడా ఫేస్‌ప్యాక్..?
ఎక్కువగా పెదాలు పొడిబారుతుంటాయి. ఈ సమస్యకు నెయ్యి చాలా ఉపయోగపడుతుంది. నెయ్యని పెదాలకు రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.
ఎక్కువగా పెదాలు పొడిబారుతుంటాయి. ఈ సమస్యకు నెయ్యి చాలా ఉపయోగపడుతుంది. నెయ్యని పెదాలకు రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పసుపులో నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
దాంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. తలస్నానానికి ముందుగా పసుపుకు తలకు రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. తేనెలో పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం కడుక్కుంటే ముఖం మృదువుగా మారుతుంది.
కొంతమందికి చిన్న వయస్సులోనే ముఖం ముడతలుగా ఉంటుంది. దాంతో రకరకాల క్రీములు వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు. అందుచేత కొబ్బరి నూనెలో కొద్దిగా వంటసోడా కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం ముడతలు తొలగిపోయి తాజాగా మారుతుంది.