Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంతులీనే చర్మం కోసం.. ఇంటి చిట్కాలు...

ముఖాన్ని కడిగిన ముత్యంలా ఉంచుకునేందుకు యువతులు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అందమనేది కేవలం బాహ్యమైనదే కాకపోయినా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా అందంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే అందుకోసం దీర్ఘకాలంలో చర్మానికి హాని చేసే క్రీములనే వాడనవసరం లేదు. ఇంట్లో అం

కాంతులీనే చర్మం కోసం.. ఇంటి చిట్కాలు...
, మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (20:47 IST)
ముఖాన్ని కడిగిన ముత్యంలా ఉంచుకునేందుకు యువతులు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అందమనేది కేవలం బాహ్యమైనదే కాకపోయినా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా అందంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే అందుకోసం దీర్ఘకాలంలో చర్మానికి హాని చేసే క్రీములనే వాడనవసరం లేదు. ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతో ముఖాన్ని చక్కగా మిలమిలలాడేలా చేసుకోవచ్చు. అందుకు సాయపడేదే స్క్రబ్‌.
 
ఒకప్పటి కాలంలో ప్రతివారం నలుగు పెట్టి సున్నిపిండితో వళ్ళు నలచుకుని మరీ తలంటి పోసుకునేవారు.ఆ సమయంలో స్క్రబ్‌గా సున్నిపిండి ఉపయోగపడేది. ఇప్పుడు ఎవరికీ అంత సమయం లేకపోవడం వల్ల బ్యూటీపార్లర్ల మీదనో లేక మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్పత్తుల మీదనో ఆధారడుతున్నారు. చక్కెర, ఉప్పు, తవుడు, జోజోబా మొలకలు, కాఫీ గింజల పొడి వంటివన్నీ కూడా చర్మంపై ఉన్న మృత కణాలను తొలగిస్తాయి. దీనితో చర్మం మృదువుగా, యవ్వనవంతంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
 
సాధారణంగా చర్మం పై పొర మృతకణాలకు వేదికగా ఉంటుంది. అయితే వారానికి ఒకసారో, రెండుసార్లో స్క్రబ్‌ను ఉపయోగించడం వల్ల అవి తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా కనుపిస్తుంది. స్క్రబ్‌ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగడమే కాదు సెల్యులైట్‌ను తగ్గించి, చర్మ రంధ్రాలను శుభ్ర పరచడమే కాకుండా పెచ్చులు లేకుండా చేస్తుంది. ఒకమాటలో చెప్పాలంటే స్క్రబ్‌ చర్మాన్ని పునరుజ్జీవింపచేస్తుంది.
 
ఎలా పని చేస్తుంది?
స్పా ట్రీట్‌మెంట్లలో బాడీ స్క్రబ్‌ అనేది కీలకం. ఒకరకంగా చెప్పాలంటే నలుగు పెట్టడమేనన్నమాట. స్పాలలో స్క్రబ్‌ చేసిన తర్వాత సాధారణంగా ఏదైనా తైలంతో శరీరానికి మసాజ్‌ చేస్తారు. దీనితో చర్మం చాలా విశ్రాంతి పొంది మిలమిలా మెరుస్తుంది. ఎవరైనా ప్రొఫెషనల్‌ ఈ పని చేయాలంటే 30-45 నిమిషాలు పడుతుంది. అత్యవసరం అనుకుంటే ఆ పనిని అరగంటలో కానిచ్చుకుని, శరీరానికి సన్‌ స్క్రీన్‌ కలిగిన మాయిశ్చరైజర్‌ రాసుకుని వెళ్ళిపోవచ్చంటారు స్పా నిర్వాహకులు.
స్క్రబ్బింగ్‌ ముఖానికి చేసుకున్నా, శరీరానికి చేసినా తర్వాత ఆ భాగాన్ని నీటితో కడుక్కోవడం చాలా ముఖ్యం. స్క్రబ్‌ చేసే సమయంలో తొలగిన మృతకణాలు చర్మంపైనే ఉండకుండా దానివల్ల తొలగిపోతాయి.
 
స్క్రబ్‌ వల్ల కలిగే పెద్ద లాభం ఏంటంటే కాలుష్యం, దుమ్ము ధూళిలో తిరగడం వల్ల వచ్చే స్కిన్‌ టాన్‌ ఇట్టే తొలగిపోతుంది. అంతేకాదు చర్మపు గరుకుదనం పోయి మెత్తగా, మృదువుగా మారుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంట్లోని టీవీని ఎలా శుభ్రం చేస్తున్నారు?