Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలొవెరాతో కురులు ఆరోగ్యం ఎలా?

Advertiesment
Aloe Vera Hair Mask
, బుధవారం, 3 జనవరి 2024 (09:36 IST)
అలొవెరాలో విటమిన్లు, అమినో యాసిడ్స్‌ ఉండటం వల్ల జుట్టుకెంతో మంచిది. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సులువుగా ఇంట్లోనే తయారు చేసుకునే హెయిర్‌ ప్యాక్స్‌ ఏంటో చూద్దాం.
 
* బౌల్‌లో టేబుల్‌ స్పూన్‌ అలొవెరా జెల్‌తో పాటు టీస్పూన్‌ మందారపూల పొడిని తీసుకోవాలి. బాగా మిక్స్‌ చేసి జుట్టుకు పట్టిస్తే వెంట్రుకల డ్యామేజీని అరికడుతుంది.
 
* బౌల్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు, రెండు టేబుల్‌ స్పూన్ల అలొవెరా జెల్‌, రెండు టేబుల్‌ స్పూన్ల తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి గంటపాటు వదిలేయాలి. ఆ తర్వాత చన్నీళ్లతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలకు రెండుసార్లు చేస్తే చుండ్రు తగ్గిపోతుంది. జుట్టులో మెరుపు వస్తుంది.
 
* రెండు టేబుల్‌ స్పూన్ల అలొవెరా జెల్‌, రెండు టేబుల్‌ స్పూన్ల కొబ్బరినూనెను ఒక బౌల్‌లో వేసి మిక్స్‌ చేయాలి. దీన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తుంటే జుట్టు పొడవుగా పెరగటంతో పాటు గట్టిగా ఉంటుంది.
 
* బౌల్‌లో మూడు టేబుల్‌ స్పూన్ల అలొవెరా జెల్‌, మూడు టేబుల్‌ స్పూన్ల పచ్చికొబ్బరి పాలు, టేబుల్‌ స్పూన్‌ కొబ్బరినూనె వేసిన తర్వాత బాగా మిక్స్‌ చేయాలి.
 
* కోడిగుడ్డు సొన, రెండు టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌, మూడు టేబుల్‌ స్పూన్ల అలొవెరాజెల్‌ను బాగా కలపాలి. ఐదు నిముషాల తర్వాత జుట్టు కుదుళ్లు తాకేట్లు పట్టించాలి. పది నిముషాల పాటు మసాజ్‌ చేసినట్లు పట్టించాలి. నలభై నిముషాల తర్వాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు ఊడిపోవటం తగ్గుతుంది.
 
* అరకప్పు అలొవెరా జెల్‌, రెండు టేబుల్‌ స్పూన్ల నిమ్మరసం కలిపి మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని పట్టిస్తే జుట్టులో ఉండే రెడ్‌నెస్‌తో పాటు ఇరిటేషన్లు ఉండే తొలగిపోతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యాప్సికమ్ తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు