అందమైన, ఆరోగ్యకరమైన నఖ సౌందర్యానికి..
* వారానికి ఒకసారి గోళ్లను కత్తిరించుని, చక్కని ఆకృతిలో ఉండేలా తీర్చిదిద్దుకోవాలి. కనీసం రెండు వారాలకు ఒకసారి మానిక్యూర్ చేసుకోవటం మంచిది. ప్రతిరోజూ చేతి, కాలి వేళ్లమీద పేరుకునే మృత కణాలను తొలగిస్తుండాలి. మాయిశ్చరైజర్ లేదా కొబ్బరినూనెతో మునివేళ్లను మర్దనా చేస్తే రక్తప్రసరణ బాగా జరిగి గోళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.* నెయిల్ పాలిష్‌ను తొలగించిన తరువాత ఒక టబ్‌లోకి పాదాలు మునిగేలా గోరువెచ్చని నీళ్లు తీసుకుని కాస్తంత మేలురకం షాంపూ, డెట్టాల్‌వేసి పాదాలను, చేతులను ఉంచాలి. దీంట్లో ఓ కప్పు పాలను కూడా జోడిస్తే మంచిది. ఎందుకంటే పాలలోని ల్యాక్టిక్ ఆమ్లం చర్మంమీది మృతకణాలను సులభంగా తొలగిస్తుంది.* గోళ్ల ఆరోగ్యాన్ని పైన చెప్పుకున్న జాగ్రత్తలే కాకుండా.. ఆహారం విషయంలో కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, మాంసకృత్తులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే క్యారెట్, వెన్న, బ్రకోలి, పెరుగు, బాదాం పప్పులను తరచుగా తిన్నట్లయితే గోళ్లు దృఢంగా, ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.* ఇంకా ఫోలిక్ ఆమ్లం, విటమిన్ సీ ఉండే పదార్థాలను తీసుకున్నట్లయితే గోళ్లు పెళుసుబారి విరిగిపోకుండా ఉంటాయి. వాటితోపాటుగా ఆపిల్, కోడిగుడ్లు, అల్లం, ద్రాక్ష, డ్రైఫ్రూట్స్, మొలకెత్తిన గింజలు, తృణధాన్యాలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.