Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భటార్‌కానికా పార్కులో లక్షకు పైగా పక్షులు

Advertiesment
భటార్‌కానికా పార్కులో లక్షకు పైగా పక్షులు
కేంద్రపాడ,ఒరిస్సా (ఏజెన్సీ) , శుక్రవారం, 14 డిశెంబరు 2007 (18:08 IST)
దాదాపు 1.31 లక్షల పక్షులు ఒరిస్సాలోని భటార్‌కానికా జాతీయ పార్కులో 2007 సంవత్సరం జరిపిన పక్షుల గణాంకాలలో చేరాయి. గత వారంలో భటార్‌కానికా జాతీయ పార్కులోని సరస్సుల్లో రెండు రోజులపాటు పక్షుల గణాంకాలను నిర్వహించిన నేపథ్యంలో పక్షుల సంఖ్య తెలియవచ్చిందని రాజ్‌నగర్ డివిజనల్ అటవీ అధికారి ఏకే.జెనా పేర్కొన్నారు. 97 రకాల నీటి పక్షులు మరియు 38 రకాల ఇతర పక్షులతో కలుపుకుని మొత్తం 135 రకాలు పక్షులకు భటార్‌కానికా జాతీయ పార్కు ఈ సంవత్సరం విడిదిగా మారిందని జెనా తెలిపారు.

బరునియా ముహన, చటక, ప్రహరాజ్‌పూర్, బాగాగహన్ మరియు రాయ్‌టాపాటియా ప్రాంతాలలో గల మాంగ్రోవ్ వృక్షాలపై నీటి ఒడ్డున సేదతీరే పక్షులైన సాండ్ పైపర్, ప్లోవర్, బాతులు, గూస్, హెరోన్, కోర్మొర్యాంట్స్, స్పూన్ బిల్ మరియు ఎగ్రెట్ పక్షులు కనిపించాయని వెల్లడించారు. ఈ సంవత్సరపు వార్షిక గణాంకాల సేకరణ నిమిత్తం అధికారులు నియమించిన 10 బృందాలలో ప్రముఖ పక్షి శాస్త్రవేత్తలు డా.గోహర్ అబెడిన్, రమేష్ ఝంకార్, సువేందు భట్టాచార్య మరియు బిశ్వజిత్ మోహంతి పాల్గొన్నారు.

ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ నేచుర్ (ఐయూసీఎన్)‌కు చెందిన రెడ్ బుక్ ఆఫ్ డాటాలో అంతరించిపోతున్న పక్షులుగా నమోదు చేయబడిన యూరాసియన్ వైగ్విన్, ఫెరుగెనియస్, షోబెల్లర్‌లు కనిపించడం ఈ సంవత్సరపు వార్షిక గణాంకాలలో ప్రధాన అంశంగా నిలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu