Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తీస్టా నది అందాల నడుమ కాలింపాంగ్

Advertiesment
తీస్టా నది అందాల నడుమ కాలింపాంగ్
, గురువారం, 22 మే 2008 (18:33 IST)
హిమాలయ పర్వతాల్లో పుట్టిన తీస్టా నది అందాల నడుమ ఉంది కాలింపాంగ్ వేసవి విడిది కేంద్రం. ఉత్తర బెంగాల్‌లో పర్వత ప్రాంత పట్టణం కాలింపాంగ్. భూటాన్ భాషలో కాలింపాంగ్ అంటే రాజు యొక్క మంత్రులకు పట్టున్న ప్రాంతం. స్థానిక గిరిజనులు వ్యవసాయ పనులు లేని సమయంలో పంటపొలాల్లో ఆటలు ఆడతారు. దీనితో కాలింపాంగ్ అనే పేరు ఈ ఊరికి స్థిరపడింది.

పచ్చని, దట్టమైన అడవుల నడుమ కాలింపాంగ్ ఉంది. ఒకవైపు తీస్టా నది అందాలు మరోవైపు అడవులు కాలింపాంగ్‌కు కొత్త వన్నెలను తెచ్చాయి. రంగిత్, తీస్టా నదులు సంగమించే ప్రాంతం ప్రకృతిని ఆస్వాదించే వారికి మధురానుభూతులను అందిస్తుంది.

చూడవలసిన ప్రాంతాలు

డాక్టర్ గ్రాహం గృహం
డాక్టర్ జాన్ ఆండర్సన్ గ్రాహం నేతృత్వంలో కైస్త్రవ ఆరుగురు సభ్యుల మిషనరీ 1900 సంవత్సరంలో కాలింపాంగ్‌కు వచ్చింది. వీరు ఇక్కడ ఎత్తైన పర్వత వాలుపై సువిశాల 500 ఎకాల స్థలంలో పాఠశాలను ఏర్పాటుచేశారు. దాదాపు 700 మంది విద్యార్ధులు ఇక్కడే ఉంటూ విద్యనభ్యసించేవారు. వీరికోసం డెయిరీ, పౌల్ట్రీ, బేకరీ వంటి సదుపాయాలను కల్పించారు. దీనినే డాక్డర్ గ్రాహం గృహంగా పిలుస్తారు.

దుర్పిన్ దారా
తీస్టా నది అందాలతో పాటుగా కాలింపాంగ్ మైదాన ప్రాంతాలను తిలకించే ప్రాంతం దుర్పిన్ దారా.

గౌరీపూర్ హౌస్
విశ్వకవి రవీంద్ర నాధ్ టాగోర్ వేసవి కాలంలో విడిది చేసిన ప్రాంతం గౌరీపూర్ హౌస్. దుర్పిన్ దారాకు 2కి.మీ. దూరంలో గౌరీపూర్ హౌస్ ఉంది. కాలింపాంగ్‌కు వచ్చిన ప్రతి సమయంలోనూ టాగోర్ గౌరీపూర్ హౌస్‌కు వచ్చేవారు.

కాళీబరి
కాళీమాత దేవాలయం ఉన్న ప్రాంతం కాళీబరి. కాళీమాత అతిపెద్ద విగ్రహం ఇక్కడ ఉంది.

థాప్రా చోలింగ్ ఆశ్రమం
త్రిపాలి కొండపై 1937లో నిర్మించిన ఆశ్రమం థాప్రా చోలింగ్. గేలుకా తెగ వారు బౌద్ధమత సన్యాసి దలైలామాకు కానుకగా కట్టించి ఇచ్చిన ఆశ్రమం థాప్రా చోలింగ్.

వసతి

కాలింపాంగ్ అన్నిరకాలు వారికి తగ్గ హోటళ్లు ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి
విమాన మార్గం : బాగ్‌డోగ్రా విమానాశ్రయం 80 కి.మీ. దూరంలో ఉంది.
రైలు మార్గం : న్యూ జల్పాయిగురి 80 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడి నుంచి దేశంలో అన్నిప్రాంతాలకు రైలు సేవలు ఉన్నాయి.
రహదారి మార్గం : సిలిగురి (66 కి.మీ.), గాంగటక్ (79 కి.మీ.), డార్జిలింగ్ (51 కి.మీ.)

Share this Story:

Follow Webdunia telugu