Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గద్దల సంరక్షణకు విదేశీ సహాయం

Advertiesment
గద్దల సంరక్షణకు విదేశీ సహాయం
అగర్తల (ఏజెన్సీ) , సోమవారం, 12 నవంబరు 2007 (17:15 IST)
అంతరించిపోతున్న గద్దలను కాపాడుకునేందుకు త్రిపుర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ సహాయాన్ని ఆర్థిస్తున్నది. అర్నిథోలాజిస్టుల నివేదికను అనుసరించి త్రిపుర వన్యప్రాణి సంరక్షణ సమితి కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నది. గద్దలకు సంబంధించి ప్రజలలో వేళ్లూనుకుపోయిన మూఢనమ్మకాలను పారదోలేందుకు రాష్ట్ర అటవీ శాఖ ప్రచార కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టింది.

అంతేకాక గద్దలను కాపాడుకునేందుకు గాను ఇంగ్లాండ్ కేంద్రంగా గల రాయల్ సొసైటీ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ బర్డ్స్ (ఆర్ఎస్‌పీబీ) సహాయాన్ని అటవీశాఖ కోరింది. అధికారిక నివేదికలను అనుసరించి గడచిన ఎనిమిది సంవత్సరాలుగా పట్టణ ప్రాంతాలలో గద్దలు పూర్తిగా కనుమరుగైపోయాయి.

ఇక మారుమూల ప్రాంతాలు మరియు అటవీ ప్రాంతాలలో గద్దల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం అనుసరిస్తున్న గద్దల పెంపకం ప్రాజెక్టును చేపట్టేందుకు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ సహకారాన్ని తీసుకుంటున్నట్లు వన్యప్రాణి నిపుణుడు ఏకే.గుప్తా తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu