కీకారణ్యంలో ఉండే ఓ అరుదైన గుడ్లగూబ జనారణ్యంలోకి వచ్చింది. గాయపడిన ఆ పక్షిని ఓ పిల్లవాడు రక్షించాడు. సపర్యలు చేశాడు. దట్టమైన అరణ్యాలలో అరుదుగా కనిపించే తెల్ల గుడ్లగూబ విజయవాడ నగరంలోకి వచ్చింది.
గాయంతో కనిపించిన ఆ గుడ్లగూబను సంపత్ అనే బాలుడు కాపాడాడు. చివరికి దానిని పెద్దల సహకారంతో అటవీశాఖ అధికారులకు అప్పగించాడు. దీనిని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వారు వెల్లడించారు.