Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అడవులతో అలముకున్న కేరళ అందాలు

Advertiesment
అడవులతో అలముకున్న కేరళ అందాలు

WD

కేరళ (ఏజెన్సీ) , మంగళవారం, 5 జూన్ 2007 (12:17 IST)
భారత దేశంలో నైరుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రం కేరళ. తూర్పు మరియు ఈశాన్య దిక్కులలో కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు, పడమర దిక్కున అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం కేరళ సరిహద్దులుగా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన మాహె పూర్తిగా కేరళలోనే ఉంది. కేరళ భూభాగంలో 24% అటవీ ప్రాంతం ఆక్రమించుకుని ఉంది. ఇటీవలికాలంలో అడవులను వ్యవసాయభూములుగా మార్చడం వల్ల పర్యావరణానికి జరుగుతున్న హానిని దృష్టిలో ఉంచుకొని కేరళ అడవులలో చాలా భాగాన్ని రక్షితప్రాంతంగా ప్రకటించారు.

దక్షిణ భారతంగా పరిగణించబడే నాలుగు రాష్ట్రాలలో ఒకటైన కేరళ రాష్ట్రం 1956 నవంబర్ 1న అవతరించింది. భారత దేశంలోనే అత్యధిక అక్షరాస్యత ఉన్న, అత్యంత ఆరోగ్యకరమైన కేరళ రాష్ట్రంలో ఆత్మహత్యలు, నిరుద్యోగం, నేరాలు సైతం అత్యధికంగానే ఉండటం దృరదుష్టకరం. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి - ఈరెంటి నుండి కొబ్బరిచెట్ల భూమిగా కేరళం అయిందని కొందరి అభిప్రాయం.

కేరళ రాజధాని తిరువనంతపురం, ఈ రాష్ట్రంలో 14 జిల్లాలు ఉండగా, అది 38,863 చ.కి.మీ విస్తీర్ణమైంది. కేరళ జీవవైవిధ్యం తూర్పు ప్రాంతంలో కేంద్రీకృతం అయ్యి ఉన్నది. భారతదేశపు మొత్తం వృక్షజాతిలో 4వ వంతు, అంటే దాదాపు 10,000 జాతులు కేరళలో ఉన్నాయి. అంతేకాకుండా మొత్తం 4,000 పుష్పజాతులలో 1,272 రకాలు కేరళకు సొంతం. సుమారు 900 రకాలు విలువైన ఆయుర్వేద ఔషధిమొక్కలు సైతం అక్కడ పెరుగుతున్నాయి.

కొల్లమ్ జిల్లా కోచి నీటికాలవలలో చీనా చేపలవల (చైనాలో తయారైనది). కేరళ తూర్పు భాగం పడమటి కనుమల వర్షచ్ఛాయప్రదేశానికి ఆనుకొని ఉన్నది. ఇక్కడ ఎత్తైన కొండలు, లోతైన లోయలు ఉన్నాయి. పడమటికి ప్రవహించే 41 నదులు, తూర్పుకు ప్రవహించే 3 నదులు ఇక్కడే ఆరంభమౌతాయి. పడమటి కనుమలు దాదాపు గోడకట్టినట్లున్నాయి. పాలఘాట్ సరస్సు దగ్గర మాత్రం ఖాళీస్థలం ఉన్నందున మిగిలిన భారతదేశానికి ఇది ఒక ముఖ్యమైన ద్వారమయ్యింది. పడమటి కనుమల సగటు ఎత్తు 1,500 మీ. 2,500 మీ. ఎత్తైన శిఖరాలున్నాయి.

కనుమలకు ఆనుకొని పడమటి ప్రాంతంలో మధ్యకేరళ మైదానప్రాంతం ఉంది. ఇక్కడ ఎత్తుపల్లాల భూములు, లోయలు ఎక్కువ. 250 మీ, 1000మీ. మధ్య ఎత్తులున్న ఇక్కడి కొండలకు తూర్పు అంచున నీలగిరి కొండలు, పళని కొండలు, అగస్త్యమలై, అన్నామలై వంటి పర్వతప్రాంతాలు సైతం ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu