Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరు జిల్లాలో మరో పర్యాటక కేంద్రం ఉబ్బలమడుగు... సిద్ధేశ్వరాలయానికి వందేళ్ల చరిత్ర

చిత్తూరు జిల్లాలో మరో పర్యాటక కేంద్రం ఉబ్బలమడుగు... సిద్ధేశ్వరాలయానికి వందేళ్ల చరిత్ర
, ఆదివారం, 15 మే 2016 (11:29 IST)
ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రసిద్థి చెందిన చిత్తూరు జిల్లాలోని ఉబ్బలమడుగు ఫాల్స్‌లో పర్యాటకుల సందడి కనిపిస్తోంది. అధిక ఉష్ణోగ్రత ఉండడంతో వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు పర్యాటకులు ఉబ్బలమడుగు ఫాల్స్‌కు క్యూకడుతున్నారు. ఆంధ్రా నుంచే కాకుండా తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ప్రతిరోజు పర్యాటకులు ఉబ్బలమడుగుకు చేరుకుంటున్నారు.
 
తిరుపతి నుంచి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది ఉబ్బలమడుగు. వాహనాల్లో వెళితే 75 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సిందే. అతి భయంకరమైన డీప్‌ ఫారెస్ట్ ఇది. ఎంతో అందంగా చల్లటి వాతావరణం ఉంటుంది. ఎంత దూరం నడిచినా అలసట రాకుండా ఎంతో చల్లగా ఉంటుంది ఉబ్బలమడుగు. రోడ్డు మొత్తం మట్టితో ఉన్నా అక్కడక్కడ చిన్న చిన్న కొలనులు కనిపిస్తుంటుంది. దీంతో అక్కడక్కడ పర్యాటకులు కొలనుతో దిగి ఎంజాయ్‌ చేస్తున్నారు. నీళ్ల మీద కట్టిన బ్రిడ్జి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
 
మరోవైపు చెక్‌ డ్యాంలు ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. యువత కేరింతలు కొడుతూ ఎంతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఈ ప్రాంతంలో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఉబ్బలమడుగు ఎంట్రన్స్ నుంచి జలపాతాల వద్దకు వెళ్ళాలంటే 10 కిలోమీటర్లకుపైగా నడిచి వెళ్ళాల్సిందే. 10 కిలోమీటర్లు నడిచినా అలసట ఉండదంటే ఇక్కడ ప్రాంతం ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుంది. ఎంత వేడి ఉన్నా ఈ ప్రాంతంలో మాత్రం ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. అది ఇక్కడి ప్రత్యేకత.
webdunia
 
ఇక జలపాతాల వద్దకు వెళితే మనల్ని.. మనం మరిచిపోవాల్సిందే. అంత చల్లటి ఆహ్లాదకర వాతావరణం. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు ఉబ్బలమడుగుకి చేరుకుని ఎంజాయ్‌ చేస్తున్నారు. మరోవైపు ఉబ్బలమడుగులో వందేళ్ళ చరిత్ర కలిగిన సిద్ధేశ్వర ఆలయం ఉంది. ఇది ఎంతో పురాతనమైనది. ఇక్కడి శివలింగం స్వయంభుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్నది భక్తుల నమ్మకం. దీంతో భక్తులు ముందుగా సిద్ధేశ్వరాలయానికి చేరుకుని పూజలు నిర్వహించిన తర్వాతనే జలపాతాల వద్దకు పయనమవుతున్నారు.
 
ఎండ వేడిమిగా ఎక్కువగా ఉండడంతో చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన తలకోన, ఉబ్బలమడుగు, సదాశివకోన, కైలానకోనలు పర్యాటకులతో సందడిగా మారాయి. ఆదివారాలైతే మరింత మంది పర్యాటకులు ఈ ప్రాంతంలో కనిపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటుడు కాకుండా నేను మరొకటా... బాబో భయంకరంగా ఉంది... మహేష్‌ బాబు