Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భటార్‌కానికా పార్కులో పక్షుల గణాంకాలు

భటార్‌కానికా పార్కులో పక్షుల గణాంకాలు
కేంద్రపాడ,ఒరిస్సా (ఏజెన్సీ) , శనివారం, 8 డిశెంబరు 2007 (14:18 IST)
FileFILE
ఒరిస్సాలోని భటార్‌కానికా జాతీయ పార్కు... శీతాకాలంలో దేశాంతరాల నుంచి వలస వచ్చే పక్షులకు ఆహ్లాదకరమైన విడిది. ఇంతటి ప్రత్యేకత సాధించుకున్న ఈ ఉద్యానవనంలో ప్రతి ఏటా నిర్వహించే పక్షుల గణాంకాలను శనివారం నుంచి ప్రారంభించారు.

రెండురోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో భటార్‌కానికా అటవీ అధికారులతో పాటు పక్షి నిపుణులు, పరిశోధకులు మరియు ఓర్నిథోలోజిస్టులు పాల్గొన్నట్లు రాజ్‌నగర్ డివిజనల్ అటవీ అధికారి ఏకే.జెనా తెలిపారు.

అంతేకాక ప్రస్తుతం చిలికాలో ఉన్న బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (బీఎన్‌హెచ్ఎస్) పక్షి నిపుణులు సత్య సోల్వం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. గత సంవత్సరం జరిపిన పక్షులు గణాంకాలలో శీతాకాలపు వలస పక్షులు మరియు స్థానిక పక్షులు సంఖ్య 1.20 లక్షలుగా తేలింది.

Share this Story:

Follow Webdunia telugu