కాంక్రీట్ కట్టడాలు అడవులను ఆక్రమించుకుంటూ వెళుతున్నాయి. కళ్లకు కనబడిన ఎన్నో జీవులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రంపంచవ్యాప్తంగా వన్యమృగ సంరక్షణకు అవసరమైన చర్యలు ఆయా దేశాలు తీసుకుంటున్నాయి. కొన్ని అరుదైన వన్యమృగ సంపద అంతరించిపోకుండా వుండేందుకంటూ కొన్ని ప్రత్యేక చర్యలను చేపడుతున్నారు.
ఇందులో భాగంగా అంతరించే దశకు చేరుకున్న జంతువులను జంతు ప్రదర్శనశాలలో వుంచి వాటి వృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రపంచ అరణ్యాలలో దాదాపు కనుమరుగయ్యే దశలో వున్న తెల్ల సింహపు పిల్లలను ఇటీవల జర్మనీ సఫారీపార్క్ ప్రదర్శనకు వుంచింది.
ఎంతో ముద్దుగా వున్న ఈ తెల్ల సింహపు పిల్లలను చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఇక జర్మనీ మీడియా సింహపు పిల్లలను చుట్టిముట్టింది. ముద్దుగా వున్న సింహపు పిల్లలను ఈ వీడియోలో చూడండి.