Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సముద్రపు తాబేలు కూర తిని ముగ్గురి మృతి, 30 మందికి పైగా అస్వస్థత

sea turtle

బిబిసి

, మంగళవారం, 3 డిశెంబరు 2024 (20:01 IST)
అంతరించిపోతున్న జాతికి చెందిన సముద్రపు తాబేలు కూర తిని ముగ్గురు మృతి చెందారు. మరో 32 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన ఫిలిప్పీన్స్‌లోని సముద్రతీర డేల్‌నార్టే ప్రావిన్స్‌లోని మెగుయినడ్డాలో జరిగింది. ఈ తాబేలు కూర తిన్న స్థానిక టెదుతే తెగకు చెందిన అనేకమంది వాంతులు, విరేచనాలు పొత్తికడుపు నొప్పితో బాధపడినట్టు అధికారులు చెప్పారు. ఫిలిప్పీన్స్ పర్యావరణ చట్టాల ప్రకారం సముద్రపు తాబేళ్లను వేటాడటం, వాటిని ఆహారంలో వినియోగించడం నిషిద్ధమైనప్పటికీ, ఇక్కడి కొన్ని తెగలలో ఈ సముద్రపు ప్రాణుల వంట ఓ సంప్రదాయంగా మారింది.
 
కలుషితమైన ఆల్గేలను ఆహారంగా తీసుకునే తాబేళ్లను తినడం వల్ల అవి విషపూరితంగా మారే అవకాశం ఉంది. టెదుతే తెగ ప్రజలు వినియోగించిన సముద్రపు తాబేలు కూరను తిన్న కుక్కలు, పిల్లులు, కోళ్లు చనిపోయాయని స్థానిక అధికారి ఐరీన్ డిల్లో బీబీసీకి తెలిపారు. వీటి మృతిపై అధికారులు విచారణ జరుపుతున్నారని ఆమె చెప్పారు.
 
అడోబో వంటకం..
సముద్ర తాబేలు కూరను స్థానికులు అడోబో అనే పేరుతో వండుతారు. ఇది ప్రసిద్ధ ఫిలిప్పినో వంటకం. వెనిగర్, సోయాసాస్‌లో మాంసాన్ని, కాయగూరలను కలిపి దీన్ని తయారుచేస్తారు. "ఇక్కడ ఎండ్రకాయలు, చేపలు వంటివి ఎన్నో దొరుకుతాయి. ఇలా జరగడం దురదృష్టకరం" అని డిల్లో చెప్పారు. ఆసుపత్రిలో చేరిన చాలామంది డిశ్చార్జ్ అయ్యారని స్థానిక మీడియా చెబుతోంది. మృతులు ముగ్గురికి వారి సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు చేశారు.
 
ఈ ప్రాంతంలో సముద్ర తాబేళ్ల వేటపై ఉన్న నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని అధికారులతో చెప్పానని స్థానిక కౌన్సిలర్ దాతు మొహమ్మద్ సిన్సుత్ జూనియర్ చెప్పారు. ‘ఇలాంటి ఘటనలు ఇంకెప్పుడు జరగకూడదు’ అన్నారు. అనేక సముద్ర తాబేళ్ల జాతులు అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి. ఫిలిప్పీన్స్‌లో వీటిని సేకరించడం, హాని కలిగించడం లేదా చంపడం చట్టవిరుద్ధం. సముద్రపు తాబేళ్లను మాంసం, గుడ్ల కోసం వేటాడటం కొన్ని సంస్కృతులలో ఉంది. వీటిలో ఔషధ గుణాలున్నాయని వారు నమ్ముతారు. తూర్పు సమర్ ప్రావిన్స్‌ సమీపంలో 2013లో దొరికిన సముద్రపు తాబేలును తిన్న గ్రామస్థులలో 68 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురు మరణించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.. పడ్డాడో అంతే సంగతులు? (వీడియో)