Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షర్మిల కారు అద్దాలు తెరచే ప్రయత్నం చేస్తున్న పోలీసులు

Advertiesment
car
, మంగళవారం, 29 నవంబరు 2022 (14:32 IST)
ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న సొంత వాహనంలోనే వైఎస్ షర్మిల ఉన్నారు. కారు దిగడానికి ఆమె నిరాకరిస్తున్నారు. ఆమెతో మాట్లాడి కిందకు దించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. లాఠీలతో కారు అద్దాలను కిందకు దించాలని వారు చూస్తున్నారు.

 
వైఎస్ షర్మిల కూర్చొని ఉన్న కారును ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు లాక్కొని వచ్చారు. ప్రస్తుతం ఆమె కారులోనే కూర్చొని ఉన్నారు. ఆమెను దిగమని పోలీసు అధికారులు కోరుతున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన ఆమెను పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 
నిన్న పాదయాత్రలో జరిగిన దాడి ధ్వంసమైన కారును నడుపుకుంటూ ఆమె ప్రగతి భవన్‌కు వెళ్లే ప్రయత్నం చేశారు. పంజాగుట్ట చౌరస్తా వద్ద వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు.

 
నిన్న జరిగిన దాడిలో ధ్వంసమైన కారును ఆమె నడుపుకుంటూ ప్రగతి భవన్ దిశగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అదే సమయంలో వైఎస్‌ఆర్‌టీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ఆమె కారు నుంచి దిగడానికి నిరాకరించారు. దాంతో షర్మిల కారులో ఉండగానే టోయింగ్ లారీ తీసుకొచ్చి ఆ కారును పోలీసులు లాక్కొని వెళ్లారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ నుంచి హైదరాబాద్ స్పెషల్ సీబీఐ కోర్టుకు బదిలీ-సుప్రీంకోర్టు ఆదేశాలు