Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌ను కోల్పోయిన నష్టాన్ని భర్తీ చేసేందుకు విశాఖకు రూ.1400 కోట్లు :ప్రెస్ రివ్యూ

హైదరాబాద్‌ను కోల్పోయిన నష్టాన్ని భర్తీ చేసేందుకు విశాఖకు రూ.1400 కోట్లు :ప్రెస్ రివ్యూ
, మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (14:18 IST)
హైదరాబాద్‌ను కోల్పోయిన నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్రం విశాఖకు రూ. 1400 కోట్లు ఇవ్వనుందని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ విభజనతో హైదరాబాద్‌ను కోల్పోవడం ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి విశాఖపట్నం అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో 15వ ఆర్థికసంఘం రూ.1,400 కోట్ల గ్రాంట్‌ను సిఫార్సు చేసింది.

 
నగరాన్ని ప్రధాన ఆర్థిక కేంద్రంగా, అభివృద్ధి సూచీ (గ్రోత్‌పోల్‌)గా రూపుదిద్దాలని.. ఇందుకోసం రహదారులు, నీటిసరఫరా, విద్యుత్తు పంపిణీ, భూగర్భ డ్రైనేజీ, అవసరమైన భవనాల నిర్మాణానికి ఏపీ నిధులు కోరింది. ఈ మేరకు తాము సిఫార్సు చేశామని ఆర్థిక సంఘం వెల్లడించింది. తక్కువ వర్షపాతం పడేచోట, దీర్ఘకాలంగా కిడ్నీవ్యాధులు, ఫ్లోరైడ్‌ సమస్య ఉన్న ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు గ్రాంట్లు కావాలని కూడా ఏపీ విజ్ఞప్తి చేసిందని పేర్కొన్నట్లు పత్రిక రాసింది.

 
అందుకే కిడ్నీ సమస్యలున్న ఉద్దానం ప్రాంతానికి రూ.300 కోట్లు, ఫ్ల్లోరైడ్‌ సమస్యతో సతమతమవుతున్న గుంటూరు జిల్లాలోని పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతాలకు కలిపి రూ.400 కోట్లు, యురేనియం ఫిల్టరింగ్‌తో ప్రభావితమైన పులివెందుల ప్రాంతానికి రూ.200 కోట్ల ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు ఆర్థికసంఘం తెలిపింది.

 
రాష్ట్రానికి మంజూరు చేసిన రూ.2,300 కోట్ల రాష్ట్ర ప్రత్యేక గ్రాంట్లన్నీ ఈ పనులకే ఉపయోగించుకోవాలని పేర్కొంది. ఈ పద్దు కింద 2021-22లో ఏమీ రాదు. తర్వాత రెండేళ్లలో ఏటా రూ.460 కోట్ల చొప్పున విడుదలవుతుంది. మిగిలిన రెండేళ్లు రూ.690 కోట్ల చొప్పున అందుతుందని ఈనాడు వివరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లిపై కన్నేశాడు... అడ్డుగా ఉన్నారనీ చిన్నారులను కిడ్నాప్ చేసి...