Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్ ప్రెస్‌మీట్: ‘నేనే దేవుణ్ని అన్న హిరణ్యకశిపుడు.. పొట్టుపొట్టు అయిండు’

Advertiesment
kcrao
, శనివారం, 6 ఆగస్టు 2022 (18:21 IST)
‘‘ఏదైనా ముఖ్యమైన నిర్ణయం మీద నీతి ఆయోగ్‌లో చర్చ చేస్తున్నారా? ఇది కోఆపరేటివ్ ఫెడరలిజమా? లేదంటే ఇంపీరియల్ డిక్టేటరిజమా?’’ అని కేసీఆర్ కేంద్రం తీరును విమర్శించారు. ‘‘అధికార పార్టీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతాడు. డైరెక్ట్‌గా. మొత్తం భారతదేశంలో ఏకస్వామ్య పార్టీ ఉంటుంది, మిగతా వాటిని మింగేస్తాం, అని ఓపెన్‌గా చెప్తారు. ఇదేనా టీమ్ ఇండియా.?

 
ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాస్తూ రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఇవే రేపు మిమ్మల్ని కూడా కబళిస్తాయి కదా? చర్యకు ప్రతి చర్య ఉంటుంది కదా? ఏక్‌నాథ్ షిండేలను సృష్టిస్తారా? ఇవన్నీ ఎవరి ప్రోత్సాహంతో జరుగుతున్నాయి? ఏం తమాషాగా ఉందా? ఇంత అహంకారమా? బెంగాల్‌లో, తెలంగాణలో, తమిళనాడులో ప్రకటిస్తారు.

 
ప్రజలంటే ఇంత నిర్లక్ష్యమా? ఏమైనా మాట్లాడితే జైల్లో వేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఇదేం పద్ధతి? టెంపరరీ ఫేజ్ కదా. హిరణ్యకశిపుడు కూడా నేనే దేవుణ్ని, నన్నే మొక్కాలి అన్నాడు. చివరికి ఏమైంది? పొట్టుపొట్టు అయిండు’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చార్జింగ్‌ పెట్టిన ఎలక్ట్రిక్‌ బైక్‌: బ్యాటరీ పేలి మంటలు వ్యాపించాయి..