Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ వ్యాయామాలు చేస్తే మహిళలకు పీరియడ్స్ నొప్పులు తగ్గుతాయా?

Yoga
, శనివారం, 26 ఆగస్టు 2023 (22:38 IST)
ఎండోమెట్రియాసిస్ లక్షణాలలో నొప్పితో కూడిన పీరియడ్స్, అలసట ముఖ్యమైనవి. ఈ వ్యాధికి కారణం తెలియదు, నివారణ లేదు. అయితే నొప్పి నివారణకు మందుల నుంచి హార్మోన్ల చికిత్సలు, శస్త్రచికిత్సల వరకు చేస్తుంటారు. ఇది ఎక్కువ నొప్పికి కలిగిస్తుంది. మహిళలకు పని, వ్యాయామాలు చేయడం కష్టతరం అవుతుంది. పర్సనల్ ట్రైనర్ స్టెఫ్ విలియమ్స్‌కు ఎండోమెట్రియాసిస్ గురించి బాగా తెలుసు. ఎండోమెట్రియాసిస్ వస్తే చాలా ఇబ్బందులుంటాయని ‘బీబీసీ న్యూస్‌బీట్‌‌’తో స్టెఫ్ చెప్పారు. కత్తిపోట్లకు గురైతే ఎలాంటి నొప్పి ఉంటుందో అంత తీవ్రమైన నొప్పులను ఒక రోజు తాను అనుభవించినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. "నా పరిస్థితి ఏంటో కూడా నాకర్థం కాలేదు, నాకు సిగ్గనిపించింది, ఎందుకంటే వేరే మహిళలు అలా బాధపడుతున్నట్లు నేనెప్పుడూ వినలేదు" అని స్టెఫ్ విలియమ్స్‌ చెప్పారు.
 
ఎండోమెట్రియాసిస్ అంటే ఏమిటి?
ఎండోమెట్రియాసిస్ వ్యాధి నెలసరితో సంబంధమున్న ఒక రుగ్మత. ఇది యుక్తవయస్కులు సహా ఏ వయస్సు స్త్రీలకైనా రావొచ్చు. గర్భకోశం లోపల మాత్రమే ఉండాల్సిన కణజాలంతో కూడిన పలచని పొర (టిష్యూ) ఇతర అవయవాలలో కూడా ఏర్పడటమే ఎండోమెట్రియాసిస్. ఫెలోపియన్ ట్యూబ్స్ (అండాలను అండాశయం నుంచి గర్భాశయానికి తీసుకెళ్లే నాళం), కటి భాగం (పెల్విస్), పెద్ద పేగులు, చిన్న పేగులు, యోని (వెజైనా)లలో ఎక్కడైనా ఈ పొర ఏర్పడవచ్చు. అరుదుగా ఊపిరితిత్తుల్లో, కళ్లల్లో, వెన్నెముకలో, మెదడులో కూడా ఏర్పడవచ్చు. దిగువ పొట్టలో నొప్పి, వెన్ను నొప్పి, పీరియడ్స్ నొప్పి, సెక్స్ సమయంలో లేదా తర్వాత నొప్పి వంటివి దీని లక్షణాలు. కొంతమంది స్త్రీలలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. చాలామందిలో నొప్పి తగ్గిపోవచ్చు, అయితే ఈ పరిస్థితి ఒక్కోసారి సంతానలేమికి దారి తీస్తుంది.
 
'ఇది మహిళలకు యుద్ధంలాంటిది'
ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు వ్యాయామం చాలాముఖ్యం. స్టెఫ్‌కు 22 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. అయితే, ఆమెకు ఎండోమెట్రియోసిస్ వచ్చిందని తెలిశాక, అంత నొప్పిలో కూడా ఆమె శరీరాన్ని ఎలా కదిలించాలో నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితి ఉన్న చాలామందిలాగే ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. మొదట్లో ఆమె రోజు చేసే సాధారణ వ్యాయామాల్లో భాగమైన కార్డియో కూడా చేయలేకపోయారామె. బరువులూ ఎత్తలేకపోయారు. తన మానసిక ఆరోగ్యం కోసం ముందుకు వెళ్లాలని స్టెఫ్ కోరుకున్నారు. సాయం కోసం ఆన్‌లైన్‌లో వెతికారు. ఎక్కువగా ఉపయోగపడలేదు. దొరికిన సమాచారం కూడా సరిగా లేదు.
 
"ఇది నిరాశపరిచింది, ఆన్‌లైన్ సలహాలు గందరగోళంగా ఉన్నాయి. వైద్యుల సలహా కూడా అస్పష్టంగా ఉంది" అని ఆమె గుర్తుచేసుకున్నారు. "దాని గురించి నేనే పరిశోధించాల్సి రావడం నాకు చిరాకు తెప్పించింది. మహిళలకు ఇది ఓ యుద్ధం లాంటిదే. కానీ 10 ఏళ్లుగా రోజువారీ నొప్పి భరించిన తర్వాత ఇది అవసరమని తెలుసుకున్నా" అని స్టెఫ్ తెలిపారు. మహిళల ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్న ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో జనరల్ ప్రాక్టీషనర్, పరిశోధకురాలు డా. శారోన్ దీక్షన్, స్టెఫ్‌ అభిప్రాయాలతో ఏకీభవించారు. ఎండోమెట్రియాసిస్‌కు ఎలాంటి వ్యాయామం సాయపడుతుందనే దాని గురించి ఎక్కువగా ఆధారాలు లేవని శారోన్ న్యూస్‌బీట్‌తో చెప్పారు. " వాటివల్ల ఎలాంటి ఉపయోగం లేదని కాదు, ఇది మరింత సైన్స్ అభివృద్ధి చేయవలసిన ఏరియా" అని ఆమె అన్నారు.
 
మీరు ఎలా వ్యాయామం చేస్తారు?
ఎప్పుడైనా నొప్పిగా అనిపిస్తే కొంచెం నెమ్మదిగా నడక మొదలుపట్టాలని స్టెఫ్ అంటున్నారు. "హాట్ గర్ల్ వాక్‌లు ఇప్పుడు ట్రెండ్‌గా ఉన్నాయి, కానీ ఏడేళ్ల క్రితం నాకు 90 ఏళ్ల బామ్మ నడక చేస్తున్నట్లు అనిపించేది" అని ఆమె చెప్పారు. "నా శరీరానికి అది బాగుండేది. అప్పట్లో రోజులో 10 నిమిషాల నడిస్తే చాలనిపించేది" అని అన్నారు. స్టెఫ్‌కు సొంత యాక్టివ్‌ వేర్ బ్రాండ్, వర్కౌట్ యాప్‌ ఉంది. ఆమె పైలేట్స్, యోగా వంటి సాఫ్ట్ వ్యాయామాలు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ యోగాలు చేయడానికి జిమ్‌లు లేదా స్టూడియోలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు స్టెఫ్. ఇంట్లో నుంచే వాటిని చేయడం నేర్చుకోవచ్చని, అనంతరం ఇథర మహిళలకు సహాయం చేయాలని ఆమె సూచించారు.
 
"ఆపరేషన్ తర్వాత 6 నుంచి 8 వారాల పాటు మీరు బరువులు ఎత్తలేరు. కానీ పైలేట్స్ చేస్తే, అది మీ కండరాలను కరిగిస్తుంది" అని స్టెఫ్ చెప్పారు. మీరు ఎండోమెట్రియోసిస్, పీరియడ్స్ నొప్పితో బాధపడుతున్న స్త్రీల మధ్య సారుప్యత గుర్తించొచ్చని డాక్టర్ శారోన్ అంటున్నారు. "పీరియడ్స్ నొప్పి వస్తే వ్యాయామం చేస్తే తగ్గుతుంది. అంటే యోగా లేదా పైలేట్స్ వంటి వ్యాయామాలు దీనికి ఉపయోగపడతాయి" అని ఆమె అన్నారు. "నొప్పి తీవ్రతను తగ్గించడంలో వ్యాయామం నిజంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఇతర నొప్పులను అనుభవించే వాళ్ల ద్వారా తెలుసుకున్నాం" అని డాక్టర్ శారోన్ తెలిపారు. స్టెఫ్‌కు ఎండోమెట్రియోసిస్ వ్యాధి ఉన్నప్పటికీ ఆమె వ్యాయామం కొనసాగించారు. అయితే ఎండోమెట్రియోసిస్‌తో బాధపడుతున్న మహిళలు అలాంటి వ్యాయామాలు చేయాలనుకుంటే ఓపికగా ఉండాలని స్టెఫ్ సలహా ఇచ్చారు. "ఇది చాలా చిరాకు కలిగిస్తుంది. కానీ మీరు అనుకున్నది సాధిస్తారు. చేయాల్సిందంతా చేసుకుంటూ పోవడమే. కష్టమైన రోజులున్నాయి. కానీ, మంచి రోజులు కూడా వస్తాయి'' అని స్టెఫ్ అంటున్నారు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టైలిష్ డిజైన్‌‌తో మార్కెట్లోకి గ్లామర్ బైక్