Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రికార్డు స్థాయిలో చమురు ఉత్పత్తిలో కోత, ఒపెక్ సభ్య దేశాల నిర్ణయం: ధరల యుద్ధానికి ఫుల్ స్టాప్

Advertiesment
రికార్డు స్థాయిలో చమురు ఉత్పత్తిలో కోత, ఒపెక్ సభ్య దేశాల నిర్ణయం: ధరల యుద్ధానికి ఫుల్ స్టాప్
, శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (19:28 IST)
చమురు ఉత్పత్తిలో కోత విధించాలన్న నిర్ణయంపై ఒపెక్ సభ్య దేశాల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. రోజుకు 10% మేర ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తిలో కోత విధించడం గతంలో ఎన్నడూ జరగలేదు.

 
నిజానికి రష్యా సహా ఇతర చమురు ఉత్పత్తి దేశాలన్నింటినీ ఒప్పిస్తూ ఏప్రిల్ 9నే ఈ ఒప్పందంపై ఓ ప్రకటన చేసేలా ఒపెక్ ప్లస్ ఒప్పించింది. కానీ చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు మెక్సికో అంగీకరించలేదు. ప్రస్తుతం ఈ తాజా ఒప్పందంపై ఒపెక్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే అన్ని దేశాలు ఈ విషయంలో స్పష్టత ఇచ్చాయి. రోజుకు 9.7 మిలియన్ బ్యారెళ్ల మేరకు ఉత్పత్తిలో కోత విధించనున్నాయన్న విషయాన్ని మాత్రమే ప్రస్తుతానికి ఒపెక్ సభ్య దేశాలు వెల్లడించాయి.

 
చమురు ధరల్లో పెరుగుదల
తాజా నిర్ణయంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరల్లో పెరుగుదల కనిపించింది. ఆసియా మార్కెట్లలో బ్యారెల్‌కు ఒక డాలర్ మేర ధర పెరిగింది. ఇక బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 3.9% పెరిగి 32.71 డాలర్లకు చేరగా అమెరికాలో ఉత్పత్తయ్యే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడాయిల్ ధరలు కూడా బ్యారెల్‌కు 6.1% మేర పెరిగి 24.15 డాలర్లకు చేరుకున్నాయి.

 
“ఇదొక అసాధారణమైన ఒప్పందం. ఎందుకంటే ఇది కేవలం ఒపెక్, ఒపెక్ ప్లస్ దేశాల మధ్య మాత్రమే జరిగిన ఒప్పందం కాదు... అమెరికా సహా జీ-20 దేశాలు కూడా ఉత్పత్తిలో కోత విధించేందుకు అలాగే కొంత మేర నిల్వ చేసేందుకు అంగీకరించాయి” అని మార్నింగ్ స్టార్ చమురు పరిశోధన సంస్థ డైరక్టర్ శాండీ ఫైల్డన్ బీబీసీతో చెప్పారు.

 
ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, కువైట్ ఇంధన శాఖ మంత్రి డాక్టర్ ఖలీద్ అలీ మొహమ్మద్ అల్-ఫదల్ ట్వీట్ చేశారు. సౌదీ అరేబియా ఇంధన మంత్రిత్వ శాఖ, రష్యా న్యూస్ ఏజెన్సీ “టాస్” కూడా వేర్వేరుగా ఇదే విషయాన్ని చేశాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 కోట్ల మంది ప్రజలు లాక్ డౌన్ కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. దీంతో గ్లోబల్ ఆయిల్ డిమాండ్ మూడో వంతుకు పడిపోయింది.

 
ఉత్పత్తిలో కోత విధించే విషయంలో ఒపెక్ ప్లస్ దేశాల మధ్య చర్చలు విఫలం కావడంతో మార్చి నెలలో ఆయిల్ ధరలు 18 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి.

 
రష్యా-సౌదీల మధ్య పీటముడి
ముఖ్యంగా రష్యా-సౌదీ అరేబియాల మధ్య పీట ముడి పడింది. అయితే ఆ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరే సూచనలు కనిపిస్తున్నాయని ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించిన తర్వాత చమురు ధరల్లో పెరుగుదల కనిపించింది. గురువారం ఒపెక్ ప్లస్ తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు ప్రస్తుతానికి సభ్యదేశాలు రోజుకు 10 మిలియన్ బ్యారెళ్లు లేదా మే 1 నాటికి 10 శాతం మేర ఉత్పత్తిలో కోత విధిస్తాయి.

 
సభ్య దేశాలు కానివి అంటే అమెరికా, కెనడా, బ్రెజిల్, నార్వేలు తమ ఉత్పత్తిలో మరో 5 మిలియన్ బ్యారెళ్ల మేర కోత విధించే అవకాశం ఉంది. ఆ తర్వాత జులై నుంచి డిసెంబర్ మధ్యలో రోజుకు 8 మిలియన్లు, 2021 జనవరి నుంచి 2022 ఏప్రిల్ మధ్య కాలంలో రోజుకు 6 మిలియన్ బ్యారెళ్ల మేర ఉత్పత్తిలో కోత విధించే అవకాశం ఉందని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

50 సర్జరీలు చేసుకున్న టిక్ టాక్ స్టార్ సహార్‌కు కరోనా