Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్టికల్ 370 రద్దు: ‘ఇక భారతీయులంతా కశ్మీర్‌లో భూమి కొనుక్కోవచ్చు...

ఆర్టికల్ 370 రద్దు: ‘ఇక భారతీయులంతా కశ్మీర్‌లో భూమి కొనుక్కోవచ్చు...
, సోమవారం, 5 ఆగస్టు 2019 (14:29 IST)
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై రాజకీయ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఈ అంశంపై ట్వీట్ చేశారు.


''ఇది అద్భుతమైన రోజు. భారత యూనియన్‌లో జమ్మూ కశ్మీర్‌ను పూర్తిగా విలీనం చేయడంతో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీతో ప్రారంభమైన వేలాది మంది బలిదానానికి గౌరవం దక్కింది. యావత్ దేశం కోరుకున్న ఏడు దశాబ్దాల కోరిక మన కళ్ల ముందే నెరవేరింది'' అని పేర్కొన్నారు.

 
చీకటి రోజు
శ్రీనగర్‌లో గృహనిర్భంధంలో ఉన్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ దీనిపై ట్వీట్ చేశారు. ‘భారత ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు. 1947లోనే 'రెండు దేశాల సిద్ధాంతాన్ని' కశ్మీరీ నేతలు తిరస్కరించి భారత్‌తో పొత్తుపెట్టుకున్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ఏకపక్ష నిర్ణయం, రాజ్యాంగ విరుద్ధం’అని ఆమె పేర్కొన్నారు.

 
ఆర్టికల్ 370 రద్దు చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదని తాను ముందే చెప్పానని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు. ''ఆర్టికల్ 370 రద్దు చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదని నేను చెప్పిందే సరైందని రుజువైంది. ఈ రోజు అమిత్ షా, రాష్ట్రపతి ద్వారా పార్లమెంటుకు 370 ఆర్టికల్ రద్దును తెలియజేశారు'' అని ట్వీట్ చేశారు.

 
ఆర్టికల్ 370 రద్దు అనేది సాహాసోపేత, చారిత్రక నిర్ణయం అని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ అన్నారు. ‘‘గ్రేట్ ఇండియా, వన్ ఇండియాకు సెల్యూట్’ అని ట్వీట్ చేశారు. ఈరోజు ఒక చారిత్రక తప్పిదాన్ని చెరిపేశాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368ను అనుసరించకుండా దొడ్డిదారిలో వచ్చిన ఆర్టికల్ 35ఏ రద్దు అయింది‘‘ అని బీజేపీ నేత అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు.

 
కశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు తాము మద్దతు ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
 

‘కశ్మీర్‌లో భూమి కొనుక్కోవచ్చు’
కశ్మీర్‌లో కశ్మీరీలు తప్ప ఇతరులు భూమి కొనుగోలు చేయకుండా ఇంతకాలం చట్టపరమైన అడ్డంకులు ఉండేవి. ఆర్టికల్ 370 రద్దుతో ఆ అడ్డంకులు తొలగిపోయినట్లు చాలామంది భావిస్తున్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం, ఇతరులు భూమి కొనుగోలు చేయకుండా ఉన్న ప్రత్యేక నిబంధన వంటివన్నీ ఇప్పుడు తొలగిపోయాయని ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖా దత్ ట్వీట్ చేశారు.

 
కాగా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇక భారతీయులంతా కశ్మీర్‌లో భూమి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారని, ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ రాష్ట్రంపై దృష్టి పెట్టారంటూ సోషల్ మీడియాలో మీమ్స్ పోటెత్తాయి.

 
‘ఇది సంఘ్ పరివార్ ఫార్ములా’
కాగా, భారతీయులంతా కశ్మీర్‌లో ఆస్తులు కొనుగోలు చేసి, అక్కడ స్థిరపడాలన్నది సంఘ్ పరివార్ పాత అజెండా అని పాకిస్తాన్ జాతీయుడైన అసద్ రహీమ్ ఖాన్ అనే యూజర్ ట్వీట్ చేశారు. తద్వారా కశ్మీర్ లోయలో హిందూ మెజార్టీని నెలకొల్పాలనేది సంఘ్ పరివార్ ఫార్ములా అని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

370, 35A: బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రులకు మోడీ ఫోన్ కాల్స్