సెలవులు వస్తున్నాయంటే చిన్నా, పెద్దలతో సహా ఇంటిల్లిపాదికి ఆటవిడుపు లాంటిదే. ఇక విందులు, వినోదాలు, సంతోషాలకు హద్దే ఉండదు. ముఖ్యంగా ఆ రోజుల్లో తినే తిండికి, చిరుతిళ్ళకు లెక్కే ఉండదు. ఏవి పడితే అవి తింటూ, తాగుతూ డైట్ గురించి పట్టించుకోవడం మర్చిపోతారు.ఫలితం. స్లిమ్‌గా ఉండేవాళ్ళు కాస్తా... బొద్దుగా తయారవుతారు. ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక అనేది లేకుండా తినడం వల్ల పెరిగిన లావు, ముందు ముందు భారీకాయంగా మారే ప్రమాదం రాకముందే ప్రతిఒక్కరూ జాగ్రత్తపడటం అవసరం. ఈ సమయంలో తినే పదార్థాలలో కొవ్వు కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తపడాలి. |
సెలవు రోజుల్లో ప్రశాంతంగా తిని ఉండకుండా ఈ కట్టుబాట్లేంటిరా... అనుకుంటే అధిక బరువును కొనితెచ్చుకోక తప్పదు. కాబట్టి... ఈ రోజుల్లో పూర్తిగా డైట్ చేయమని చెప్పట్లేదు కానీ... పోషక విలువలతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకున్నట్లయితే చిరుతిళ్ళ వైపుకు దృష్టి పోదు |
|
|
అలాగని అలాంటి ఆహారపదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండమని చెప్పడం లేదు కానీ, కొవ్వు కేలరీలు శరీరానికి సాధ్యమైనంత తక్కువగా అందజేస్తేనే శరీరం అదుపు తప్పకుండా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి... సెలవు రోజుల్లో ఎలాంటి ఆహారం తీసుకుంటే స్లిమ్‌గా ఉంటారో ఇప్పుడు చూద్దాం...!
ముందుగా ప్రొద్దుటిపూట ప్రొటీన్లు పుష్కలంగా ఉండే బ్రేక్‍ఫాస్ట్ తినడం చాలా అవసరం. ఈ ప్రొటీన్లు అరిగేందుకు ఎక్కువ సమయం పడుతుంది. తద్వారా త్వరగా ఆకలి అనిపించదు.
ఇక, పార్టీలకు వెళ్లేవారు ఖాళీ కడుపులతో మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లకూడదు. పార్టీలకు వెళ్లేముందే తక్కువ కొవ్వు ఉండే స్నాక్స్ గానీ, లేదా సలాడ్‌లు గానీ కొద్దిగా తినేసి వెళ్ళాలి. ఇలా వెళ్లటం వల్ల విందులో మితంగా తినగలరు.
ప్రతిరోజూ ఉద్యోగ భారంతో సతమతమయ్యేవారికి సెలవురోజుల్లో ఏ పనీ లేకపోవడం వల్ల తిండిమీదే ఎక్కువగా ధ్యాస ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు చిరుతిండ్ల పేరుతో స్వీట్లు, కారాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. వీటిద్వారా పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు ఏర్పడుతుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు సంక్లిష్టంగా ఉండే కార్బోహైడ్రేట్లను తీసుకోవాల్సి ఉంటుంది.
చిరుతిళ్ళే కదా అనుకుంటూ తినటం వల్ల వాటినుంచి శరీరానికి 500 నుంచి 1000 లోపు అదనపు క్యాలరీలు వచ్చి చేరతాయి. తిండి ఎక్కువగా తిన్న రోజుల్లో ట్రెడ్‌మిల్ వ్యాయామం కాస్తంత ఎక్కువగా చేస్తే మరీ మంచిది.
సెలవు రోజుల్లో ప్రశాంతంగా తిని ఉండకుండా ఈ కట్టుబాట్లేంటిరా... అనుకుంటే అధిక బరువును కొనితెచ్చుకోక తప్పదు. కాబట్టి... ఈ రోజుల్లో పూర్తిగా డైట్ చేయమని చెప్పట్లేదు కానీ... పోషక విలువలతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకున్నట్లయితే చిరుతిళ్ళ వైపుకు దృష్టి పోదనే విషయాన్ని మాత్రం గమనిస్తే చాలు.
పోషకాహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దు. నిరంతరం ఉత్సాహంగా ఉండే పనులను చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే సెలవు రోజుల్లో మీ శరీరం అదుపు తప్పకుండా ఉండటమే కాకుండా... చక్కటి ఆకృతితో, ఎంతో ఆరోగ్యంగా చురుగ్గా ఉంటుంది. కాబట్టి... వీటిని తప్పక పాటిస్తారు కదూ...!