సిట్రస్ పండ్లు తీసుకోండి.. గుండెపోటును దూరం చేసుకోండి!!
, గురువారం, 29 మార్చి 2012 (17:05 IST)
సిట్రస్ పండ్లను మహిళలు తీసుకోవడం ద్వారా గుండెపోటును దూరం చేసుకోవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. మహిళలు ఆరెంజ్, నిమ్మ వంటి పండ్లను జ్యూస్ రూపంలోనూ లేదా అలాగే తీసుకోవడం ద్వారా గుండెపోటును నివారించవచ్చునని బ్రిటన్‌లోని తూర్పు ఆంగ్లినా యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. లెమన్, ఆరెంజ్, ఉసిరి లాంటి సిట్రస్ పండ్లతో పాటు ఆపిల్, దాక్ష, దానిమ్మ కాయలను తీసుకోవడం కూడా మహిళల ఆరోగ్యానికి చాలా మంచిదని, తాజా కూరగాయలు, డార్క్ చాక్లెట్, రెడ్ వైన్‌లలో ఫ్లావోనోయిడ్స్ ఉండటం ద్వారా హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని అధ్యయనంలో తేలినట్లు జిన్హువా పత్రిక పేర్కొంది. మహిళలు ముఖ్యంగా విటమిన్ "సి"గల పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలని ఆంగ్లియా యూనివర్శిటీ ప్రొఫెసర్ అడిన్ కసిడీ తెలిపారు. సిట్రస్ పండ్లలోని ఫ్లావోనోయిడ్స్ గుండెకు సంబంధించిన రక్తపు నాళాల పనితీరును మెరుగుపరుస్తాయని, తద్వారా గుండెపోటు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చునని బ్రిటన్ వర్శిటీ అధ్యయనంలో తెలియవచ్చింది.