సంపూర్ణ ఆహారం లభించాలంటే ఏం చేయాలి!?
, శుక్రవారం, 25 మే 2012 (17:49 IST)
మీకు సంపూర్ణ ఆహారం లభించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో మీకు తెలుసా.. అయితే కథనం చదవండి. ఉదయం ఆరు గంటలకు ఒక గ్లాసు పాలు లేదా రాగి జావ తాగండి. ఉదయం 8 గంటలకు నాలుగు ఇడ్లీలు లేదా సమానమైనటువంటి టిఫిన్ తీసుకోండి. ఉదయం పది గంటలకు ఒక గ్లాసు పండ్లరసం లేదా ఏవైనా పండ్లు తీసుకోండి. మధ్యాహ్నం 12 గంటలకు రెండు కప్పుల అన్నం, ఒక కప్పు ఆకుకూర పప్పు, ఒక కప్పు కూర, కప్పు పెరుగు, పచ్చి కూరగాయలు తీసుకోండి. సాయంత్రం నాలుగు గంటలకు.. ఒక కప్పు టీ, స్నాక్స్ లేదా మొలకెత్తిన శెనగలు-పెసలు లాంటివి తీసుకోండి. రాత్రి ఎనిమిది గంటలకు రెండు చపాతీలు, కప్పు అన్నం, కప్పు కూర, రసం తీసుకోండి. రాత్రి పది గంటలకు ఒక గ్లాసు పాలు తాగండి. ఇలా చేస్తే మీకు సంపూర్ణ ఆహారం లభించినట్లే..!