శాకాహారమే ఎందుకు తినాలి? మాంసాహారం తీసుకోకూడదా!?
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2011 (11:12 IST)
కూరగాయలు తినడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, మాంసాహారం తీసుకుంటేనే బలంగా ఉంటాం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ మాంసహారం కంటే వెజిటేరియన్ డైట్‌తోనే ఎక్కువ ప్రయోజనాలున్నాయంటున్నారు పోషకహార నిపుణులు. శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..!డీటాక్సిఫై:వెజిటబుల్ డైట్‌లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అంటే పీచుపదార్థాలు. పాలకూర, క్యాబేజీ, సొరకాయ గుమ్మడి వంటి కూరగాయలలో పీచుపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. పీచుపదార్థాలు శరీరానికి చాలా అవసరం. మలబద్ధకం రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండాల్సిందే. శరీరంలో నుంచి టాక్సిన్స్‌ను బయటకు పంపించడానికి ఈ ఫైబర్ చక్కగా ఉపయోగపడుతుంది. నాన్ వెజ్‌లో ఫైబర్ లభించదు.ధృడమైన ఎముకలు:మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ప్రొటీన్ శాతం పెరిగిపోతుంది. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా శరీరం కాల్షియం గ్రహించడం తగ్గిపోతుంది. ఎముకలు బలహీనంగా మారతాయి. శాకహారుల్లో ఇలాంటి సమస్యలు తక్కువే.కార్బోహైడ్రేట్స్ లోపం:నాన్-వెజిటేరియన్ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా లభిస్తాయి. శరీరానికి తగినంత కార్బోహైడ్రేట్స్ లభించనపుడు అది కెటొసిస్‌కు దారితీస్తుంది. అంటే శరీరం తనకు అవసరమైన ఎనర్జీ కోసం కొవ్వును కలిగించుకొంటుంది. అంతేకాకుండా వెజిటేరియన్ ఫుడ్‌లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా జీర్ణం అవుతూ శరీరానికి అవసరమైన గ్లూకోజ్‌ను మెల్లగా అందిస్తాయి. అయితే నాన్‌వెజ్‌లో ఫ్యాట్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.ఆగ్యకరమైన చర్మం:బీట్‌రూట్, టమోట, గుమ్మడి, కాకరకాయ వంటి కూరగాయలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆపిల్స్, పియర్స్, జామకాయ లాంటి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. మాంసాహారం తీసుకోవడం వల్ల చర్మానికి ఎలాంటి ఉపయోగం లేదు.బరువు నియంత్రణ:కొవ్వును తగ్గించుకోవాలంటే సులభమైన మార్గం నాన్‌వెజ్‌కు దూరంగా ఉండటమే. మాంసాహారం తీసుకునే వారు బరువును తగ్గించుకోలేరు. అయితే నాన్‌వెజ్‌కు బదులుగా తృణధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, నట్స్, ఫ్రూట్స్ తీసుకొంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటుంది. వెజిటేరియన్ డైట్ వల్ల అధిక రక్తపోటు, అధిక బరువు నియంత్రణలో ఉంటాయి.ఫైటో న్యూట్రియెంట్స్:డయాబెటిస్, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, స్ట్రోక్, బోన్ లాస్ వంటి వ్యాధులను ఫైట్రోన్యూట్రియెంట్స్ తీసుకోవడం ద్వారా నివారించవచ్చు. ఇవి వెజిటేరియన్ డైట్‌లో మాత్రమే లభిస్తాయి. నాన్‌వెజ్ తీసుకునే వారిలో వీటికి కొరతేవుంటుంది.సులభంగా నమలడం:మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడం లాలాజలంతో మొదలవుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడే ఈ ప్రక్రియ మరింత బాగా జరుగుతుంది. అంతే కాకుండా కూరగాయలతో తీసుకునే ఆహారాన్ని సులభంగా నమలవచ్చు.