మహిళలూ.. వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు!?
, మంగళవారం, 24 జులై 2012 (18:16 IST)
వర్షాకాలంలో మహిళలు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాల్సిందేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో ఆకుకూరల్లో నీరు అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. అందుచేత ఆకుకూరలపై క్రిమికాటకాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత వీలైనంత వరకు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం తగ్గించండి. కాయలు పులుసు సాంబార్, చట్నీలను తరుచు తీసుకోవాలి. ఇక పుదీనా చట్నీ, ఉల్లి, వెల్లుల్ని తేసిన పదార్థాలు వాడితే జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే పులుపు పదార్థాలు పెరుగు, మజ్జిగలాంటివి పూర్తిగా తగ్గించాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.