మహిళలూ.. ఆలస్యం చేయకండి.. ఖర్జూరాలు తీసుకోండి!
, శుక్రవారం, 14 డిశెంబరు 2012 (17:44 IST)
మహిళలు ఖర్జూరాలను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మనదేశంలో మహిళలు ఖర్జూరాలను తప్పకుండా ఎక్కువగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఎందుకంటే మన దేశంలోని 85 శాతం యుక్తవయుసున్న మహిళల్లో రక్తహీనత ఉంటుంది.ప్రతి 100 గ్రాములు ఖర్జూరాల్లో 0.90 మి. గ్రా ఐరన్ ఉంటుంది. దాంతో ఖర్జూరాలు క్రమం తప్పకుండా తినేవారికి రక్తహీనత తగ్గుతుంది. ఖర్జూరాల్లో ఉన్న పోషకాలు, అవి చేసే మేలు ఎంత అని చెప్పలేం. ఇందులో ఫ్రక్టోజ్, డెక్స్‌ట్రోజ్ అనే చక్కెర పదార్థాలు ఎక్కువుగా ఉండటం వల్ల ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు చెబుతున్నారు.ఖర్జూరాల్లో పీచుపదార్థం (డయటరీ ఫైబర్) చాలా ఎక్కువ. ఖర్జూరాలు తింటే అందులో ఉన్న పీచుపదార్థాలు శరీరంలో ఉన్న చెడుకొలెస్ట్రాల్‌కు అడ్డుపడి శరీరంలో ఇంకకుండా చూస్తాయి. దాంతోపాటు తేలిగ్గా మలవిసర్జన కావడం జరుగుతుంది. ఖర్జూరాల్లో ఉండే టాన్సిన్ అని పిలిచే ప్లేవనాయిడ్ పాలిఫీనాలిక్ యాంటీఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్లు, మంట, వాపు వంటివి కలగడాన్ని, రక్తస్రావాలను నివారిస్తాయి. ఇందులో ఉన్న జీ-గ్జాంథిన్ అనే పోషకం మన కంటి రెటీనాలోకి శోషితమై కంటిని సంరక్షిస్తుంటుంది. వయసు పెరగడం వల్ల కన్ను సామర్థ్యం తగ్గడాన్ని ఈ పోషకం నివారిస్తుంది. హైబీపీ ఉన్నవారు వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండెజబ్బులు, పక్షవాతం వంటి వాటిని నివారిస్తుంది. ఎందుకు మరి ఆలస్యం ఈరోజు నుంచే ఖర్జూరం తినడం మొదలు పెట్టండి.